‘భారీ’ డౌట్; ఎవరికీ మల్లన్నసాగర్?

Update: 2016-07-20 04:46 GMT
విపక్షాలకు.. ప్రజా సంఘాలకు.. మేధావులకు మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. రాజకీయ నాయకుడు నోటి నుంచి వచ్చే మాటకు ఒక రంగానికి చెందిన నిపుణుడు చెప్పే మాటలకు ప్రజల్లో ఉండే స్పందన వేరుగా ఉంటుందని చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడు చేసే విమర్శను పట్టించుకోని ప్రజలు.. ఒక మేధావి.. నిపుణుడైన వ్యక్తి చెప్పే మాటలకు స్పందించే తీరు భిన్నంగా ఉంటుందని చెప్పాలి. అందులోకి సామాజిక చైతన్యం ఎక్కువగా ఉండే తెలంగాణ లాంటి రాష్ట్రంలో.. ఏదైనా అంశానికి సంబంధించి ప్రభుత్వం మొండిగా ముందుకెళితే అందుకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

తాజాగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద లక్ష్యం మేరకు ఆయుకట్టుకు నీరు అందించటానికి మల్లన్నసాగర్ అసలు అవసరం లేదని నిపుణులు.. మేధావులు స్పష్టంగా కొట్టిపారేయటం తెలంగాణ ప్రభుత్వానికి శరాఘాతం లాంటిదనే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లన్నసాగర్ ను కట్టి తీరుతామని అధికారపక్ష నేతలు బల్లగుద్ది చెబుతున్న వేళ.. అంతే బలంగా.. ఆ ప్రాజెక్టు అవసరమే లేదని మేధావులు.. ప్రజాసంఘాల నేతలు.. ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేయటం తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందికరమైన పరిస్థితిగా చెప్పాలి.

ఇందుకోసం ఏదో నాలుగు మాటలు చెప్పటం వదిలేసి.. తమ వాదన వెనుక ఉన్న బలమైన అంశాల్ని వారు ప్రస్తావించటం గమనార్హం. వారు చెబుతున్న మాటలు కన్వీన్స్ గా ఉండటం.. తప్పు పట్టేలా ఉండకపోవటం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసేవిగా ఉన్నాయని చెప్పక తప్పుదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కేవలం తెలంగాణ అధికారపక్షంలోని కొందరి ప్రయోజనాల కోసం మాత్రమేనన్న విమర్శలకు బలం చేకూరేలా మేధావుల మాటలు ఉండటం కేసీఆర్ అండ్ కో ను ఉక్కిరిబిక్కిరి చేసే అంశంగా చెప్పాలి.

ఇంతకీ.. మల్లన్నసాగర్ మీద నిపుణులు.. మేధావులు.. ప్రజాసంఘాలు చేస్తున్న వాదన ఏమిటన్నది చూస్తే..

= 60 రోజుల్లో మొత్తం నీటిని తీసుకునే అవకాశం ఉన్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్లు అవసరం తప్ప.. పంటకు అవసరమైన అన్ని రోజులూ నీటిని తీసుకోవటానికి అవకాశం ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అవసరం లేదు.

= కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మళ్లించే నీరు అయకట్టు అవసరాలకు సరిపోతుంది. రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయాలంటే పంపులు..కాలువల సామర్థ్యం పెంచితే సరిపోతుంది. రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయాలంటే పంపులు.. కాలువల సామర్థ్యం పెంచాలి. ఇందుకోసం 8 నుంచి 10 పంపులు అదనంగా ఏర్పాటు చేయాలి.

=  ప్రపంచంలో కాల్వల మీద రిజర్వాయర్లు ఎక్కడ కట్టినా సాంకేతిక సూత్రాలు ఒకేలా ఉంటాయి. నదిలో నీరు లభించే రోజుల కంటే వినియోగించుకునే రోజులు ఎక్కువైతే నీరు నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. పాలమూరు – రంగారెడ్డి - దిండి ఎత్తిపోతల పథకాలకు 60 రోజులు నీళ్లు తీసుకుంటే 120 రోజులు పంటకు సరఫరా చేయాల్సి ఉంటుంది.

= ప్రాణహిత – చేవెళ్ల పాత డిజైన్ ప్రకారం కూడా రిజర్వాయర్లు అవసరమే. ప్రస్తుతం కాళేశ్వరం నుంచి చేపట్టిన డిజైన్ ప్రకారం అవసరం లేదు.

= మల్లన్నసాగర్ ప్రాజెక్టు డిజైన్ ఖరారు కాక ముందే భూసేకరణ మొదలుపెట్టటం ఏమిటి? రెవెన్యూ.. పోలీసుల అధికారులతో నిర్వాసితులపై ఒత్తిడి తేవటం ఏమిటి?

= ఇంజనీరింగ్ నిపుణులు ప్రత్యామ్నాయాలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకకుండా.. భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి ప్రాజెక్టుల్ని నిర్మించటం ఏమిటి? 
Tags:    

Similar News