తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వేళ.. లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తున్న వేళ.. కఠిన నిర్ణయాల్ని తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగా తొలి అడుగు పడింది. ముఖానికి మాస్క్ లేకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వారికి రూ.వెయ్యి ఫైన్ వేయాలని నిర్ణయించారు.
తాజాగా దీనికి సంబంధించి జీవో ఒకటి జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించటం తప్పనిసరి చేయటంతో పాటు.. భారీ జరిమానా వేయాలని డిసైడ్ చేశారు. మాస్కు నిబంధనను పేర్కొంటూ గురువారం విడుదల చేసిన జీవోలో.. ‘‘మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందే. మాస్కు లేకుండా వచ్చిన వారికి జరిమానా విధించే అధికారం పోలీసులు.. అధికారులకు ఉంటుంది’’ అని జీవోలో పేర్కొన్నారు.
మరి.. మాస్కు అంటే ఏమిటి? ఎలా ఉండాలి? దేన్ని మాస్కు కిందకు పరిగణలోకి తీసుకుంటారు? లాంటి ప్రశ్నలకు జీవోలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాకుంటే మాస్కు అంటే.. ముఖానికి అడ్డు పెట్టుకోవటమే అంటూ ఈ మధ్యన జరిగిన ప్రెస్ మీట్లో సీఎం కేసీఆర్ స్పష్టం చేయటం తెలిసిందే.
చేతి రుమాలు.. చిన్నసైజు తుండుగుడ్డ.. ఇలా ఏదో ఒకటి కట్టుకోవటమే ముఖ్యమన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తున్నారు. ఎందుకంటే.. నోటి నుంచి వచ్చే నీటి తుంపరులతోనే కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్న నేపథ్యంలో.. కరోనా వ్యాప్తికి చెక్ చెప్పేందుకు వీలుగా తాజా జీవో జారీ చేశారని చెప్పాలి. జీవో ముచ్చట బాగుంది.. మరి సీఎం సాబ్ ఈసారి ప్రెస్ మీట్లో ముఖానికి మాస్కు పెట్టుకొని వస్తారంటారా?