బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆయనకు, సీఎం కేసీఆర్ కు మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. కేంద్రం తెలంగాణకు ఎంతిచ్చిందో అమిత్ లెక్కలు చెప్పడం... అవన్నీ తప్పని కేసీఆర్ ఖండించడం తెలిసిందే. ఆ వాదం బాగా వాడీవేడిగా సాగడంతో రెండు పార్టీల మధ్య తేడా కొట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడికి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఎండగట్టడం కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వానికి బాగా కోపం తెప్పించినట్లుంది... అందుకే తెలంగాణ ప్రభుత్వంతో ఆటాడుకోవడం మొదలుపెట్టింది. నిధులు విడుదల చేయడంలో నిబంధనల సాకు చూపించి చుక్కలు చూపిస్తోంది.
నిజానికి ఈ పరిణామం జరగడానికి ముందువరకు కేంద్రంలోని బీజేపీ, ఇక్కడ తెరాస పెద్దలు ఒకరినొకరు ప్రశంసించుకుంటూ జబ్బలు చరుచుకున్నారు. ఒకరి నిర్ణయాలకు మరొకరు మద్దతు పలుకుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎయిర్ పోర్టులోనే సీఎం కేసీఆర్ భుజంపై చేయివేసి పక్కకు తీసుకెళ్లి ముచ్చట్లు పెట్టారు. అంతోటి ఫ్రెండ్షిప్ ఇప్పుడు దెబ్బతినేసింది. అమిత్ షా పర్యటన తర్వాత సీనంతా మారిపోయింది. ఇప్పుడు దోస్తీని పక్కన పెట్టి కేంద్రం టీ సర్కార్ కు షాకులిస్తోంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాకే ఇచ్చింది. ఈ ఏడాది వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిదులను విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన ప్రాంతాలకు జిల్లాకు 50 కోట్ల చొప్పున 450 కోట్ల రూపాయలు ఇవ్వాలంది. అయితే ఇక్కడే తిరకాసు పెట్టింది కేంద్రం. గతేడాది విడుదల చేసిన నిధులకు సంబందించి యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సమర్పిస్తేనే నిధులు విడుదల అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం సర్టిఫికెట్లు పంపినా, మరిన్ని వివరాలు కావాలని, ఈ స్కీమ్ కింద వేసిన రోడ్ల పొడవుతో సహా సమాచారం అంతా కావాలని కేంద్రం కోరిందట. దీంతో చేసేదేం లేక అధికారులు ఆ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. గత ఏడాది మాత్రం అంతకు ముందు సంవత్సరానికి యుటిలైజేష్ సర్టిఫికెట్లు ఇవ్వకపోయినా నిధులు ఇచ్చిన కేంద్రం… ఇప్పుడు మాత్రం కండీషన్ లు పెడుతోంది. ఇదంతా చూస్తుంటే కేంద్రం కేసీఆర్ పై ప్రతీకారం ఈ రకంగా తీర్చుకుంటోందని వినిపిస్తోంది.
అయితే... తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమీ తక్కువ తినలేదని.. కేంద్రానికి అంతకుమించి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని టాక్. మోడీతో దోస్తీ బాగున్న రోజుల్లో జీఎస్టీకి మద్దతిచ్చిన ఆయన ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో దెబ్బ కొట్టాలనుకుంటున్నారట. కేంద్రం ఇలాగే ఎక్కువ తక్కువ చేస్తే తన సాయం అవసరమైన అంశాల్లో మొండికేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. చూడాలి ఇది ఏమవుద్దో... ఎక్కడి వరకు వెళ్తుందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/