సుజనాకు షాకిచ్చిన హైకోర్టు.. ఏం జరిగిందంటే?

Update: 2021-06-30 05:30 GMT
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఇందుకు ఆయన వ్యవహరించిన తీరే కారణమన్న మాట వినిపిస్తోంది. తాజాగా తాను అమెరికాకు ఒక సదస్సులో పాల్గొనటానికి వెళ్లాల్సి ఉందని.. అందుకే తనకు వెళ్లేందుకు వీలుగా.. అత్యవసర విచారణ జరపాలని కోరారు. రెండేళ్ల క్రితం అంటే.. 2019లో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉంది. దాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది.

సదస్సులో పాల్గొనటానికి సుజనా చౌదరి అమెరికాకు వెళ్లాల్సి ఉంది. ఇలాంటప్పు అవసరమైన అనుమతుల కోసం కోర్టును ఆశ్రయించటం తప్పేం కాదు. కాకుంటే.. ఆయన చేసిన తప్పు తాజా పరిణామానికి కారణంగా చెబుతున్నారు. ఒక సదస్సుకు హాజరు కావటానికి అత్యవసరంగా వెళ్లాలని చెప్పిన సుజనా.. అందుకు అవసరమైన అంశాల్ని.. పత్రాల్ని సమర్పించాల్సి ఉంది. కానీ.. మరేం ఆలోచించారో కానీ.. కోర్టుకు ఆ పత్రాల్ని కోర్టుకు ఇవ్వకుండా అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు.

దీంతో స్పందించిన హైకోర్టు.. అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానానికి సంబంధించిన వివరాల్ని సమర్పించకుండా అత్యవసరంగా విచారణ చేపట్టమంటే ఎలా చేస్తామని ప్రశ్నించింది. ఈ పిటిషన్ విచారణను జులై ఏడుకు వాయిదా వేసింది. ఇంతకీ ఆయనపై ఉన్న లుక్ అవుట్ నోటీసుల విషయానికి వస్తే.. ఆయన డైరెక్టర్ గా ఉన్న బెస్ట్ అండ్ క్రాంప్టన్‌ కంపెనీ బ్యాంకుల్ని మోసం చేసిందన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన ఉదంతంలో నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే సుజనాకు నోటీసులు అందాయి. అత్యవసరంగా విచారణ జరపాలని కోరినప్పుడు.. అందుకు అవసరమైన సమాచారం ఇవ్వాలి కదా? అదేమీ ఇవ్వకుండానే ఉరుకులు పరుగులు పెడుతూ విచారణ చేయాలని కోరటమే సుజనా చేసిన తప్పుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News