ట్విట్టర్ కు టీహైకోర్టు తాజా నోటీసు.. స్పందించకుంటే అంటూ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ట్విట్టర్ పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము గతంలో జారీ చేసిన నోటీసులకు స్పందించని తీరును తప్పు పట్టింది. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఈసారికి రియాక్ట్ కాకపోతే మాత్రం చర్యలు తప్పవన్న వ్యాఖ్యను చేసింది. ఇంతకూ ట్విట్టర్ విషయంలో టీ హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యల్ని ఎందుకు చేసిందన్న విషయంలోకి వెళితే..
కరోనా వైరస్ నేపథ్యంలో కొందరు అతిగాళ్లు.. దారుణమైన ట్వీట్లు చేయటం తెలిసిందే. మహమ్మారి వేళ.. దాని వ్యాప్తికి కారణం ఇస్లాం మతమంటూ విపరీతమైన ట్వీట్లు చేశారు. తబ్లిగిన్ ఎపిసోడ్ ను ఉటంకిస్తూ వారు చేసిన పలు ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. సంకుచిత మనస్తత్వంతో చేస్తున్న నిందారోపణలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి అనవసరమైన ఉద్రిక్తతలకు.. సమాజంలో వర్గాల మధ్య దూరానికి పెరిగే అవకాశం ఉంటుందనన వాదన వినిపించింది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. కరోనా వ్యాక్తికి ఇస్లాం మతాన్ని ఉద్దేశిస్తూ పలు ట్వీట్లు చేస్తుంటే.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఈ ఉదంతంపై ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్.. జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.
ఈ ఉదంతంపై ట్విట్టర్ కునోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. అయినప్పటికీ ఆ సంస్థ స్పందించలేదు. దీంతో.. తాజాగా నిర్వహించిన విచారణలో.. ట్విట్టర్ కానీ స్పందించని పక్షంలో తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరి.. ట్విట్టర్ రియాక్టు అవుతుందా? కాదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.