మరోసారి కేసీఆర్ సర్కారుకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చేతిలో ఆక్షింతలు తప్పలేదు. నిజానికి ఈ విషయంలో హైకోర్టును తప్పు పట్టటానికి లేదు. ఇప్పుడున్న విపత్తు.. విపత్కర పరిస్థితుల్లో అనూహ్య నిర్ణయాలు.. ఆకస్మిక నిర్ణయాలు వద్దని.. ప్రజల్ని అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పదే పదే వినతులు చేసింది. సలహాల రూపంలోనూ తానేం చెప్పాలన్న విషయాన్ని గత విచారణల సందర్భంగానే చెప్పేసింది. ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తున్నా.. ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారంతో విసిగిపోతున్న హైకోర్టు.. ఇటీవల కాలంలో కాసింత ఘాటుగానే స్పందిస్తోంది. తమ వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వంలో చలనం వస్తుందని ఆశించింది. తన గీతను దాటకుండా జాగ్రత్తలు తీసుకొని.. ప్రభుత్వానికి మార్గదర్శకాల్ని జారీ చేసే ప్రయత్నం చేస్తోంది.
లాక్ డౌన్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పినా.. కాసిన్ని గంటల సమయాన్ని మాత్రమే ఇచ్చిన వైనంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చేత మరోసారి ఆక్షింతలు తప్పలేదు. ఇటీవలకాలంలో పెరుగుతున్న కేసుల సంఖ్య.. తగ్గిస్తున్న పరీక్షల సంఖ్యపై తనకున్న అభ్యంతరాల్ని హైకోర్టు ప్రశ్నిస్తూనే ఉంది. చివరకు రాత్రివేళ విధించే కర్ఫ్యూ గడువు ముగియటానికి రెండు.. మూడు రోజుల ముందు ముందస్తుగా నిర్ణయం తీసుకోవచ్చు కదా? అని ప్రశ్నించటాన్ని మర్చిపోకూడదు.
విపత్తు వేళ.. ప్రణాళిక బద్ధంగా పనులు సాగాలన్నది హైకోర్టు ఆలోచనగా కనిపిస్తోంది. అందుకు భిన్నంగా లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా కేసీఆర్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ ఉంటుందన్న నిర్ణయాన్ని మంగళవారం మధ్యాహ్నం వేళలో ప్రకటించటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ‘‘కనీసం ఈ రోజు ఉదయం పది గంటల వరకు కనీసం వీకెండ్ లాక్ డౌన్ కూడా పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఒక్కసారిగా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రజలు ఇంత తక్కువ టైంలో ఎలా వారి ప్రాంతాలకు వెళతారు? గత ఏడాది వలస కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈసారి పడకూడదు. రోజువారీ కూలి చేస్తూ బతికే వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?’’ అని ప్రశ్నించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిస్తూ.. 50 శాతం వలస కార్మికులు వాళ్ల వాళ్ల సొంతూళ్లు వెళ్లారని చెప్పారు. అంటే.. మరో 50 శాతం మంది హైదరాబాద్ లో ఉన్నట్లే కదా? లాక్ డౌన్ కారణంగా ఉపాధి ఉండదని తెలిసినప్పుడు వారు తమ ఊళ్లకు వెళ్లానుకుంటారు. కానీ.. లాక్ డౌన్ కారణంగా ఎలాంటి రవాణా సదుపాయాలు ఉండవు. ఇలాంటివి మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. ఈ కారణంతోనే.. హడావుడిగా లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకున్న తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయి.. ఆక్షింతలు వేసింది. ఇటీవల కాలంలో ఏమైందో కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెన్సిబుల్ నిర్ణయాల్ని తీసుకోవటం లేదు. ప్రాక్టికల్ గా ఆలోచించే పెద్ద మనిషికి ఈ మధ్యన ఏమైంది. అదే పనిగా హైకోర్టు