మాయదారి మహమ్మారి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతోంది. ప్రభుత్వ విధానాలు.. వివిధ అంశాల్లో అధికారుల తీరు కేసీఆర్ సర్కారుకు ఇప్పుడు కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతోంది. ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించటం.. విచారణ సందర్భంలో వెలుగు చూస్తున్న వివరాలు జడ్జిలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.
ఇసుక బట్టీల్లో పని చేసే వలస కార్మికుల్ని తరలించే విషయంలో సరైన ఏర్పాట్లు చేయలేదంటూ రిటైర్డు లెక్చరర్ ఎస్.జీవన్ కుమార్ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీన్ని హైకోర్టుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్ తో కూడి ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఇసుకబట్టీల్లో పని చేసే కార్మికుల తరలింపుపై నివేదిక ఏదని ప్రశ్నించగా.. అడ్వొకేట్ జనరల్ ఆ నివేదికను దాఖలు చేశారు.
విచారణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తరఫున న్యాయవాది తాము శ్రామిక్ రైళ్లను నడిపేందుకు అభ్యంతరం లేదని.. తమకు ఇప్పటివరకూ అలాంటి వినతిపత్రం రాలేదని చెప్పారు. దీంతో.. రైళ్లు నడపటానికి రైల్వేశాఖ సిద్ధంగా ఉన్నప్పుడు వారికి కలెక్టర్లు ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. వలసకార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోరా?
అంటూ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజల సంక్షేమ బాధ్యతలు చూసుకుంటామని చెబితే.. అది సుపరిపాలన. అధికారుల తీరు చూస్తుంటే.. తమ ఉత్తర్వులను అమలవుతున్నట్లుగా లేదు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉందంటూ కాస్త ఘాటుగానే హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో.. స్పందించిన న్యాయస్థానం వలస కార్మికులు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? వారి ఆశ్రయం.. ఆహారం లాంటి సదుపాయాలేమిటో చెప్పాలంటూవిచారణను ఈ రోజుకు (బుధవారం) వాయిదా వేశారు. మరి.. ఈ రోజు విచారణలో ప్రభుత్వం ఇచ్చే వివరాలపై హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో చూడాలి.