టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది అధికార టీఆర్ఎస్. అలా అని.. తెలుగుదేశం పార్టీ మాదిరి భారీ ఎత్తున నిర్వహించే మహానాడు మాదిరి కాకుండా.. పరిమిత సంఖ్యలో పార్టీకి చెందిన వారిని పిలిచి.. ఆ సంబరాల్ని నిర్వహించాలని ప్లాన్ సిద్ధం చేశారు. ఇలాంటివేళ.. రాజకీయ మైలేజ్ పెంచేందుకు వీలుగా ఎంపిక చేసిన కొన్ని ప్రధాన మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు రాష్ట్ర మంత్రి.. టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.
ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడిన కేటీఆర్.. పనిలో పనిగా విపక్షాల మీద తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గవర్నర్ వ్యవస్థ మీదా.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై మీదా విమర్శనాస్త్రాల్ని సంధించారు. తెలంగాణలో విపక్షాల బలం పెరుగుతుందన్న మాటను అడ్డంగా కొట్టేసిన ఆయన.. వాపును చూసి బలుపుగా అనుకోవద్దన్నారు.
టీవీలు.. సోషల్ మీడియాలో అరుపులు.. కేకలు.. హడావుడిని నమ్మొద్దని.. 2018 ఎన్నికల్లో బీజేపీ 108 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందన్నారు. మజ్లిస్ పార్టీ తమ ప్రత్యర్థి కావొచ్చంటూ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఏడు సీట్లు గెలిచిందని.. బీజేపీ ఒకటి గెలిచినందన్నారు. కాంగ్రెస్ కు ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఈసారి ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉంటుందన్నారు.
మజ్లిస్ కు అండగా టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏడు సీట్లు గెలవటం విషయం ఎలా అవుతుంది? అన్నది ప్రశ్న. మంత్రి కేటీఆర్ చెప్పినట్లుగా మజ్లిస్ నిజంగానే ప్రత్యర్థి అయితే.. వారు రెగ్యులర్ గా గెలిచే ఏడు స్థానాల్లో ఒక్కదాన్లో కూడా టీఆర్ఎస్ ఎంుదకు గెలవట్లేదు? అన్నది ప్రశ్న. అయితే.. ఇలాంటి ప్రశ్నల్ని కేటీఆర్ కు సంధించలేదు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా ప్రజలకు అందజేసే ధర్మం ఏదో.. సదరు ఇంటర్వ్యూలో కనిపించిదని చెప్పక తప్పదు.
ఇక.. మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారంటూ తరచూ కథనాలు రావటం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో.. ‘కేటీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారు?’ అన్న ఆసక్తికర ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఆశ ఉండాలే కానీ దురాశ ఉండొద్దని.. సిరిసిల్ల ప్రజల అశీర్వాదంతో ఎమ్మెల్యేను అయ్యానని.. తాను మంత్రిని కూడా అవుతానని అనుకోలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో తనకు మంత్రి పదవిని ఇచ్చారని.. ఇప్పుడు గెలిచి తిరిగి పవర్లోకి రావాలన్నారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో అవకాశం ఇస్తే మంత్రిగా ఉంటానని.. లేదంటే పార్టీ కోసం పని చేస్తానన్న ఆయన మాటలు వింటే.. ఇలాంటివి మంత్రి కేటీఆర్ కు మాత్రమే సాధ్యమన్న భావన కలుగక మానదు.