ప్రముఖ జర్నలిస్ట్.. సోషల్ మీడియా ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నట్టుగా వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. ఈ విషయాన్ని గురువారం క్యూ న్యూస్ టీం ప్రకటించింది.
మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం మల్లన్న వరుస అరెస్టుల నేపథ్యంలో రిమాండ్ లో ఉన్నారు. కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసిన మల్లన్నను వరుస కేసులతో కేసీఆర్ సర్కార్ నెలరోజులకు పైగా జైల్లోనే ఉంచుతోంది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరితేనే బెటర్ అని యోచిస్తున్నారు.
ఈ క్రమంలోనే మల్లన్నను విడుదల చేయించాలని మోదీ, అమిత్ షాను మెయిల్ ద్వారా ఆయన భార్య మమత విన్నవించారు. కాగా మల్లన్న రిమాండ్ లో ఉన్న సమయంలో ఆయన టీం ఈ ప్రకటన చేయడం పలు చర్చలకు తావిస్తోంది.
ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన తీన్మార్ మల్లన్నని విడుదల చేయించేందుకు ఆయన భార్య మమత ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాకు లేఖలు రాయడం సంచలనంగా మారింది.