తరచూ ఏదో ఒక వివాదాస్పద వార్తల్లో దర్శనమిచ్చే తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. తాజాగా అందుకు భిన్నమైన రీతిలో వార్తల్లో కనిపించారు.చూసినంతనే మంత్రిగారి తీరును మెచ్చుకునేలా ఆయన వ్యవహరించారని చెప్పాలి. తన వద్ద పీఏగా పని చేసే ఉద్యోగి తల్లి చనిపోతే.. మంత్రి వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంటోంది. మంత్రి పువ్వాడ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చిరుమామిళ్ల రవికుమార్ పని చేస్తున్నారు. ఆయన తల్లి దమయంతి తాజాగా మరణించారు.
తన పీఏ తల్లి చనిపోవటంతో కలత చెందిన మంత్రి పువ్వాడ.. వారికి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీలోని వారి నివాసానికి వెళ్లిన మంత్రి.. పూలమాలలు వేసి.. ఘన నివాళి అర్పించారు. వచ్చామా? వెల్లిపోయామా? అన్నట్లు కాకుండా.. అక్కడే ఉండటం.. అంతిమ సంస్కారంలో స్వయంగా పాడె మోయటం ద్వారా.. తన పెద్ద మనసును పువ్వాడ ప్రదర్శించారు. తన వ్యక్తిగత సహాయకుడి తల్లి మరణించిన సందర్భంగా మంత్రి వ్యవహరించిన తీరుకు పలువురు ప్రశంసిస్తున్నారు.