ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలపై తెలంగాణ మంత్రులు నిప్పులు చెరిగారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ రావాల్సి న అవసరం లేదని.. ప్రస్తుతం ఉన్న కేసీఆరే తెలంగాణకు అతిపెద్ద ఇంజన్ అని అభివర్ణించారు. వారి మాటల్లో విషం తప్ప.. విషయం లేదని ఆరోపించారు. విజయ సంకల్ప సభలో.. అన్ని అబద్ధాలే చెప్పారని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు ఏ ఇంజిన్లు అవసరం లేదని... కేసీఆరే అతిపెద్ద ఇంజిన్ అని పేర్కొన్నారు.
బీజేపీ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని.. చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో నీళ్లు, నియామకాల విషయంలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. 'అమిత్‌షా.. తెలంగాణలో నీళ్లు వచ్చింది నిజం కాదా? నీళ్లు ఎలా వచ్చాయో ఇక్కడి రైతులే చెబుతారు. నీళ్లు వచ్చాయనేందుకు పండిన పంటలే నిదర్శనం. లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. నీళ్లు రానిదే ధాన్యం ఎలా వచ్చింది? మీరెలా కొన్నారు?`` అని నిలదీశారు.
పంజాబ్ తర్వాత అత్యధికంగా వరి పండించేది.. తెలంగాణ అని నీతి అయోగ్ చెప్పిందని మంత్రి హరీశ్ గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ బీడు భూముల్లో పారాయన్నారు. నీళ్ల గురించి బీజేపీ కార్యకర్తలను కాదు.. తెలంగాణ రైతుల్ని అడిగితే చెప్తారని మండిపడ్డారు. దేశంలో సగటున 3శాతం వ్యవసాయ వృద్ధిరేటు ఉంటే తెలంగాణలో 10శాతం ఉందని తెలిపారు. అమిత్‌షా అవగాహన లేకుండా మాట్లాడి స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు. తప్పుగా రాసిచ్చిన స్క్రిప్టును చదివారని ప్రజలు అనుకుంటున్నట్లు వివరించారు.
``రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు ప్రధాని ప్రకటిస్తారని అనుకున్నాం. ఆర్థిక సంఘం సిఫార్సును మోడీ తప్ప దేశ ప్రధానులందరూ తప్పకుండా అమలు చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఇప్పటికీ భర్తీ చేయలేదు. తెలంగాణలో ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం. ప్రధాని ప్రసంగంలో కూడా అబద్ధాలే చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైన పథకం. 8 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కేంద్రం ఎందుకు తీసుకురావట్లేదు. 1050గా ఉన్న సిలిండర్ ధరను తగ్గిస్తామని ఎందుకు చెప్పలేదు`` అని హరీష్‌రావు ప్రశ్నించారు.
మంత్రి అజయ్ విమర్శలు..
తెలంగాణలో డబుల్ ఇంజిన్ కోసం పట్టాలు వేస్తున్నామని బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారని.. బీసీ గణన చేయనందుకా.. బీసీలకు మంత్రిత్వ శాఖ ప్రకటించనందుకా.. అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కోమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి... బీజేపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు.
గంగుల కమలాకర్ ఏమన్నారంటే..
బీజేపీ కేవలం కేసీఆర్‌ను తిట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ సభ పెట్టారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బీసీ ప్రధాని కదా.. బీసీల గురించి ఏదైనా ప్రకటిస్తారేమో అని ఆశగా ఎదురు చూశామన్నారు. 56 శాతం జనాభా బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖతో పాటు చట్ట సభల్లో రిజర్వేషన్ కావాలన్న డిమాండ్ ఎన్నో రోజులుగా ఉందని గుర్తు చేశారు. 7 శాతం అగ్రవర్ణాలున్న వారికి రిజర్వేషన్ తీసుకొచ్చారని మండిపడ్డారు. బీసీలపై కేంద్రానికి ఎందుకు వివక్ష... అని ప్రశ్నించారు. బీసీ జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు.