తెలంగాణలో కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పక్కా ముహూర్తం చూసుకుని లోపలికి అడుగులు వేశారు. అయితే.. తొలిరోజే నిర్దేశిత కార్యక్రమాలు చేపట్టాలని ముందుగానే అన్ని శాఖలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులు తొలిరోజు సచివాలయంలో ఏం చేశారనేది ఆసక్తిగా మారింది. కొత్త సచివాలయంలో తొలిరోజు పలువురు మంత్రులు కీలక ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు.
గృహ లక్ష్మి , పోడు భూముల పంపిణీపై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఇక, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై కేటీఆర్ తొలి సంతకం చేయడం గమనార్హం. అదేవిధంగా కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరుపై హోమ్ మంత్రి మహమూద్ అలీ సంతకం చేశారు. జంటనగరాల్లోని హిందూ దేవాలయాల్లో దూప దీప నైవేద్యాల ఫైల్ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతకం చేశారు. శ్రమ శక్తి అవార్డుల ఫైలు పై కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి సంతకం చేశారు. అంగన్ వాడీలకు సన్నబియ్యం పంపిణీపై మంత్రి గంగుల కమలాకర్ చేవ్రాలు చేశారు.
రెండో విడత దళిత బంధు పధకం ఫైలు ఫై సంతకం చేయనున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, రామ ప్రాజెక్టు ఫైల్ పై మంత్రి తన్నీరు హరీష్ రావు, చెక్ డ్యామ్ ల నిర్మాణం ఫైలు పై మంత్రి నిరంజన్ రెడ్డి, కొత్త మండలాలకు ఐకేపీ భవన నిర్మాణాల అనుమతి ఫైలు పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, అంగన్ వాడీ కేంద్రాల్లో ఒకటి మూడు సంవత్సరాల మధ్య ఉన్న చంటి పిల్లలకు ఉచితంగా పాలు పంపిణీ ఫైలు పై మంత్రి సత్యవతి రాథోడ్, ఉచిత చేప పిల్లల పంపిణీ ఫైలు పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లు తొలి సంతకాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయా శాఖల కార్యదర్శులు మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందించి.. ఆశీర్వాదం తీసుకున్నారు.