రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవని చెబుతారు. కానీ.. సదరు రెండు కత్తుల మధ్య రాజీ ఫార్ములా కుదిరితే ఇమిడిపోవటం పెద్ద కష్టమైన విషయం కాదన్నది తెలంగాణలోని తాజా పరిణామాల్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు. తెలంగాణ విషయంలో కించిత్ రాజీకి ఒప్పుకోని అధినేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను చెప్పొచ్చు. అదే సమయంలో తెలంగాణకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళ సై మాత్రం తక్కువ తినలేదని చెప్పాలి. సైద్ధాంతికంగా తన తీరును మార్చటం ఎవరికి సాధ్యం కాదంటారు. అలాంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. మరొకరు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఇద్దరి మధ్య పెద్దగా పొసగదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే.. ఇద్దరు ప్రముఖులు తెలివైనోళ్లు కావటం.. వారిద్దరి మధ్య రాజీ కుదిరిన వైనం తాజాగా తెలంగాణ గవర్నర్ బడ్జెట్ ప్రసంగం చెప్పేసింది. తమిళసై మేడమ్ కు అభ్యంతరం ఉన్న పౌరసత్వ సవరణ చట్టం ప్రస్తావన కించిత్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఆయన ప్రభుత్వం మీద పాజిటివ్ వ్యాఖ్యలు చేయటం ద్వారా.. ఇద్దరు ఇద్దరే సుమా అన్న భావన కలిగేలా చేశారని చెప్పాలి.
తాజాగా నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన చట్టానికి సంబంధించి తాము అమలు చేయలేమన్న తీర్మానాన్ని చేయటం ఖాయమన్న వాదన వినిపించింది. ఒకవేళ.. అదే జరిగితే.. ఆ అంశాలతో ఉన్న ప్రసంగ పాఠాన్ని గవర్నర్ చదువుతారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఇలాంటి ఇబ్బందులు రాకుండా సీఎం కేసీఆర్ జాగ్రత్త పడటంతో.. ఎలాంటి ఇబ్బంది లేకుండానే బడ్జెట్ ప్రసంగ కార్యక్రమం సాఫీగా సాగింది.
ఇంతకీ తమిళ సై చేసిన బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్య అంశాల్ని చూస్తే..
% ఉద్యమ నేత తెలంగాణ సీఎంగా ఉన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకు పోతోంది. అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధిస్తోంది. తక్కువ సమయం లో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. కరెంట్, నీటి సమస్యను తెలంగాణ అధిగమించింది.
% రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చెరువులను నిర్లక్ష్యం చేశారు. విద్య, వైద్యం, తాగు, సాగునీటిని నిర్లక్ష్యం చేశారు’ అని తమిళిసై తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను నివారించాం. వృద్ధులు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం.
% వృద్ధులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 పెన్షన్ ఇస్తున్నాం. ఒంటరి మహిళలకు సైతం పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలోనే పెన్షనర్ల వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తాం. ఉన్నత ప్రమాణాలతో రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశాం. 950 రెసిడెన్షియల్ స్కూళ్లను నడిపిస్తున్నాం. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, రూ.1కే కిలో బియ్యం ఇస్తున్నాం.
% చెరువులు, రిజర్వాయర్లపై మత్స్యకారులకు హక్కులు కల్పించాం. నాయీ బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం. యాదవులు, నేత కార్మికులను ఆదుకుంటున్నాం. 125 చదరపు గజాల లోపు ఇళ్లను క్రమబద్ధీకరిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఓవర్‌సీస్ స్కాలర్ షిప్‌లు ఇస్తున్నాం. హోంగార్డులు, అంగన్‌వాడీల జీతాలు పెంచాం. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాం.
% సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉంది. విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే ముందున్నాం. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అన్నిరంగాలకు 24గంటల విద్యుత్ ఇస్తున్నాం. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డిని వేగంగా పూర్తి చేస్తున్నాం. కాళేశ్వరం ప్రపంచంలోనే ఎత్తయిన ఎత్తిపోతల పథకం. సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేస్తాం. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
% రైతుబంధు కింద రూ.10వేలు ఇస్తున్నాం. రైతుబీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నాం. మిషన్ భగీరథతో మంచినీటి సమస్యను పరిష్కరించాం. అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం. హైదరాబాద్‌లోని అన్ని డివిజన్లలో బస్తీ దవాఖానాలు. కంటి వెలుగు తరహాలో చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు నిర్వహించాం.
% పరిపాలనలో భాగంగా భారీగా సంస్కరణలు తీసుకొచ్చాం. కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తుంది. ఎస్ ఐపాస్ విధానంతో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వేగంగా నిర్మిస్తున్నాం.
% రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయి. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 66శాతం తెలంగాణ లో ఉన్నాయి. మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల మధ్య ఐకమత్యం పెంపొందేలా లౌకిక స్ఫూర్తిని కాపాడేలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణ పై కూడా పడింది. అన్ని రాష్ట్రాల్లో వృద్ధి రేటు తిరోగమనం లో ఉంది. మన రాష్ట్రం లో ఆ దుస్థితి లేదు.