జ‌గ‌న్ ను చూసి తెలంగాణ ప్ర‌జ‌లు అసూయ ప‌డ‌టం ఖాయం!

Update: 2019-05-29 14:30 GMT
ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. రేపు ఉద‌యం విజ‌య‌వాడ‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న ఆయ‌న‌.. సాయంత్రం ఢిల్లీలో మోడీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌రు కానున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చిన ప‌క్క రోజు.. అంటే శ‌నివారం నుంచే జ‌గ‌న్ స‌చివాల‌యానికి వెళ్లేందుకు రెఢీ అవుతున్నారు. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఇప్ప‌టికే అందించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఏపీ స‌చివాల‌యంలో ఇప్ప‌టికే సీఎం ఛాంబ‌ర్.. కేబినెట్ హాల్.. హెలిపాడ్.. సీఎం కాన్వాయ్ రూట్‌ ల‌తో పాటు.. సీఎం చాంబ‌ర్ బ‌య‌ట పెట్టాల్సిన జ‌గ‌న్ నేమ్ ప్లేట్ ను కూడా సుబ్బారెడ్డి ప‌రిశీలించి ఓకే చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రెండో రోజు నుంచే స‌చివాల‌యానికి వ‌చ్చి ప‌ని చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించ‌టం.. వ‌రుస‌గా అన్ని శాఖ‌ల‌తో రివ్యూ మీటింగ్ ల‌కు ఇప్ప‌టికే టైం ఫిక్స్ చేయ‌టం తెలిసిందే.

ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చొప్పున తీసుకుంటున్న నిర్ణ‌యాల వేగాన్ని చూసి తెలంగాణ ప్ర‌జ‌లు అసూయ చెంద‌టం ఖాయ‌మంటున్నారు. త‌మ సీఎం కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా రెండోసారి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ట‌పికీ ఆయ‌న స‌చివాల‌యానికి వెళ్ల‌క‌పోవ‌టం తెలిసిందే. వాస్తు లెక్క ఏదో తేడా ఉంద‌ని.. ఆయ‌న స‌చివాల‌యానికి వెళ్ల‌కుండా ఉండ‌టం తెలిసిందే. వేరే ద‌గ్గ‌ర కొత్త స‌చివాల‌యానికి వెళ్లాల‌ని అనుకున్నా.. అదింకా వ‌ర్క్ వుట్ కాలేదు. దీంతో ఆయ‌న స‌చివాల‌యానికి వెళ్ల‌ట‌మే మానేశారు. ఆ మ‌ధ్య‌న విలేక‌రుల స‌మావేశంలో ఇదే ప్ర‌శ్న‌ను అడిగిన‌వారిపై క‌య్యిమ‌న్న కేసీఆర్‌.. సీఎం ఎక్క‌డ ఉంటే అక్క‌డే కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుంటాయ‌ని.. అలాంటి దానికి ప్ర‌త్యేకంగా స‌చివాల‌యం వెళ్ల‌టం అవ‌స‌ర‌మా? అని ప్ర‌శ్నించారు.

అలాంటి సీఎం త‌మ‌కు ఉంటే.. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రెండో రోజు నుంచే క్ర‌మం త‌ప్ప‌కుండా స‌చివాల‌యానికి వెళ్లి ప‌ని చేయాల‌ని భావిస్తున్న జ‌గ‌న్ ను చూస్తే తెలంగాణ ప్ర‌జ‌లు కాసింత అసూయ చెంద‌డ‌టం ఖాయం. త‌మ‌కు లేని వాటి గురించి ఆశ‌ప‌డ‌టం.. అవి కోరుకోకుండానే త‌మ తోటివారికి ద‌క్కుతున్న‌ప్పుడు.. అసూయ పుట్ట‌కుండా ఉంటుందా చెప్పండి?
Tags:    

Similar News