తెలంగాణ రాష్ట్ర పోలీసులకు - ఐసిస్ కు లింక్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ పై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. టీడీపీ తరఫున గెలిచి టీఆర్ ఎస్ లో చేరిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మొత్తంగా మూడు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు నకిలీ వెబ్ సైట్ ద్వారా ముస్లిం యువతను ఐసిస్ వైపు ఆకర్షిస్తున్నట్లు దిగ్విజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ వెబ్ సైట్ లేదని తెలిపిన పోలీసులు అలాంటి ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. అయితే దిగ్విజయ్ సింగ్ స్పందించకపోవడంతో పోలీసు శాఖ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. రాష్ట్ర పోలీసులపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఒక కేసు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఒక వర్గాన్ని తప్పుదారి పట్టించేలా వ్యవహరించినందుకు మరో కేసు, శాంతి భద్రతల విఘాతానికి కుట్రపన్నేలా ట్వీట్ చేసినందుకు ఇంకో కేసు నమోదు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/