ఓవైపు సంక్షేమ పథకాలు - అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ సర్కార్దూసుకుపోతోంది. దేశానికే ఆదర్శకంగా నిలుస్తోంది. మరోవైపు రాష్ట్ర భద్రత అంశాల్ని తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రజలకు ది బెస్ట్ సర్వీస్ అందిస్తున్నారు.
పోలీసింగ్ లో చేపట్టిన అధునాతన సంస్కరణల వల్ల తెలంగాణ పోలీసులు సరికొత్త రికార్డులు సృష్టించగలిగారు. టెక్నాలజీని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు - ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు త్వరలోనే ప్రపంచస్థాయి వ్యవస్థీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి మారబోతోంది తెలంగాణ పోలీసు యంత్రాంగం. దీనికోసం హైదరాబాద్ లో 350 కోట్లరూపాయల ఖర్చుతో 2 భారీ సెంటర్లు సిద్ధమౌతున్నాయి. వీటిలో ఒకటి 20అంతస్తుల భవనం కాగా - ఇంకోటి 15అంతస్తుల అధునాతన బిల్డింగ్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో ఎన్నో శాంతిభద్రతల సమస్యలు. క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండడంతో పాటు మావోయిస్టుల సమస్య కూడా అధికంగా ఉండేది. దీనికి తోడు తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన హింస - విభజన జరిగితే ఆంధ్రా ప్రజల భద్రత గాలిలోదీపంగా మారుతుందనే ప్రచారం కూడా ఎక్కువగా ఉండేది. అయితే అవన్నీ భ్రమలని తేలడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.
అధికారంలోకి వచ్చిన వెంటనే శాంతి భద్రతల అంశంపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందులోభాగంగా పోలీస్ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆధునిక పోలీసు వాహనాల కొనుగోలు నుంచి పోలీసింగ్ వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పుల కారణంగా తెలంగాణలో సమస్యపై పోలీసులు స్పందించే సమయం సరాసరి 8.5నిమిషాలకు తగ్గింది. అదే హైదరాబాద్ లో అయితే సమస్య వచ్చిన వెంటనే 5నిమిషాల్లోపే స్పందిస్తున్నారు పోలీసులు.
మార్పుల్లో భాగంగా తెలంగాణ అంతటా స్టేట్-వైడ్ ఎమర్జన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ను ప్రవేశపెట్టినట్టు డీజీపీ మహేంద్రర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఉన్న 800 పోలీస్ స్టేషన్లకు వాహనాలు సమకూర్చామని తెలిపిన డీజీపీ.. బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా రూరల్ ప్రాంతాల్లో పోలీసులు స్పందించడానికి 15 నిమిషాలు టైమ్ పడుతున్నట్టు తెలిపారు.
నేరాల్ని అదుపు చేసేందుకు -నిందితుల్ని - ప్రమాదాల్ని వెంటనే గుర్తించేందుకు జీహెచ్ ఎంసీ పరిథిలో ఏకంగా 5 లక్షల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. రాబోయే 3ఏళ్లలో మరో 5 లక్షల కెమెరాల్నితెలంగాణ అంతటా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పోలీసింగ్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఘనత కూడా తెలంగాణ పోలీస్ శాఖకు దక్కుతుంది. ఇందులో భాగంగా TSCOP అనే మొబైల్ యాప్ ను రెండేళ్ల కిందటే ప్రవేశపెట్టారు.అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టు ఈయాప్ ద్వారా స్మార్ట్ పోలీసింగ్ చేస్తున్నారు. దీంతో పాటు హాక్-ఐ అనే మరో యాప్ కూడా ప్రవేశపెట్టారు. ఈయాప్ ద్వారా ప్రతి పౌరుడు పోలీస్ మాదిరి విధులు నిర్వహించే వెసులుబాటు కలిగింది. వీటితో పాటు ఈ-పెట్టీ - కాప్-కనెక్ట్ లాంటి మరికొన్ని యాప్స్ ను కూడా ప్రవేశపెట్టి పోలీసుల్ని ప్రజలకు దగ్గర చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ముఖకవలికల ద్వారా గుర్తుపట్టే వ్యవస్థ)నుఉపయోగించిన మొదటి పోలీస్ విభాగంగా తెలంగాణ పోలీస్ గుర్తింపు పొందింది. దీని ద్వారా లక్షలాది ఫొటోల నుంచి నిందితుల్ని సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. నెట్ వర్క్ సిస్టమ్ లో ఉన్న ఫొటోల ద్వారా నిందితుల్ని సులభంగా గుర్తించడంతో పాటు తప్పిపోయిన వ్యక్తుల ఆచూకి తెలుసుకోవడానికి కూడా ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. తాజాగా ICJS అనే పైలెట్ ప్రాజెక్టును కూడా వరంగల్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు పోలీసులు. దీని వల్ల దీని ద్వారా పోలీస్ స్టేషన్లు - జైళ్లు -కోర్టులు - ఫోరెన్సిక్ ల్యాబ్స్ - ఫింగర్ ప్రింట్ బ్యూరోలను అనుసంధానించడం తేలికైంది.
Full View