ప్రపంచ దేశాలను గడగడలాడించేస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారిని నిలువరించే విషయంలో కొత్త రాష్ట్రమైనా తెలంగాణ తనదైన శైలిలో దూసుకువెళుతోంది. దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న అన్ని చర్యల్లో ఇప్పటిదాకా ముందుండి సాగుతున్న తెలంగాణ ఇప్పుడు మరో విషయంలోనే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని చెప్పక తప్పదు. తెలంగాణలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో... వైరస్ వ్యాప్తిని మరింత కట్టడి చేసే క్రమంలో బయటకు వచ్చే ప్రతి వ్యక్తి మాస్కు ధరించాల్సిందేనని ప్రకటించేసిన కేసీఆర్ సర్కారు... మాస్కు లేని వారికి ఫైన్లను కూడా ప్రకటించేసింది. తాజాగా మాస్కు లేకుండా రోడ్లపైకి వచ్చే వారిని గుర్తించేందుకు సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తూ తెలంగాణ మరో కీలక చర్య తీసుకుంది.
తాజాగా తెలంగాణ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం... ఎవరైనా మాస్కు లేకుండా బయటకు వచ్చి, తననెవరూ గుర్తించడం లేదని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. తెలంగాణ పోలీసులు ఇలాంటి వారిని గుర్తించేందుకు ఏకంగా సీసీటీవీ థర్డ్ ఐ - ఏఐ బేస్డ్ టెక్నాలజీని వినియోగించేందుకు కార్యాచణ సిద్ధం చేశారు. ఈ కొత్త టెక్నాలజీని ముందుగా హైదరాబాద్ - సైబరాబాద్ - రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వినియోగంలోకి తీసుకొచ్చేశారు. కరోనా కేసులు ఈ మూడు ప్రాంతాల పరిధిలోనే అధికంగా ఉన్న నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... ఈ టెక్నాలజీ ద్వారా మాస్కు లేకుండా సంచరించే వారిని గుర్తించడంతో పాటు వారికి రూ.1,000 చొప్పున జరిమానా విధించనుంది. అంతేకాకుండా అదేదో ఓ సారి ఫైన్ పడితే.. ఇక ఎన్నిసార్లైనా మాస్కు లేకుండా బయటకు పోవచ్చన్న వారికి షాకిస్తూ... ఎన్ని సార్లు మాస్కు లేకుండా బయటకు వస్తే... అన్ని సార్లు రూ.1,000 జరిమానాను విధించేస్తారట. ఈ తరహా చర్యతో నిబంధనలను ఉల్లంఘించాలంటేనే జనం జడుసుకుంటారన్న వాదన వినిపిస్తోంది. ఈ తరహాలో సీసీటీవీ థర్డ్ ఐ టెక్నాలజీ ద్వారా మాస్కు లేని వారిని గుర్తించే పనిని మొదలుపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డులకెక్కిందని చెప్పాలి.