టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా వేసిన నిర్ణయం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జిల్లాల విభజనను తప్పుపడుతూ రాష్ట్రపతి మొదలుకొని ప్రధానమంత్రి - హోంమంత్రి - సీఈసీలకు రేవంత్ పిర్యాదు చేశారు. దీనికి కారణం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఎస్సీ అవుతుందనే అంచనాలు వెలువడటమే. అయితే రేవంత్ బయటపడ్డారు కానీ చాలా మంది నతలు దాదాపుగా ఇదే భావనతో ఉన్నారని, అందులో అధికార తెరాస నేతలు ఉన్నారనే చర్చ సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ముచ్చటపడిన చేసిన జిల్లాల విభజనలో భాగంగా పలువురు నాయకుల రాజకీయ ఆధిపత్యం తారుమారైంది. వారికి పట్టున్న నియోజకవర్గం ఒక జిల్లా - సొంత ఊరు మరో జిల్లాకు పోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాలను - జిల్లాలను శాసించిన వీరికి కొత్త జిల్లాలో భిన్న పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్ మండలం వరంగల్ అర్బన్ జిల్లాలో చేరింది. దీంతో మంత్రి స్థానికత వరంగల్ అర్బన్ పరిధిలోకి వెళ్ళింది. వరంగల్ జిల్లాలో నేతల పరిస్థితి మరీ గందరగోళంగా తయా రైంది. ఒక్కొక్కరి నియోజకవర్గం రెండు మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి భూపాల పల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఉన్న భూపాలపల్లి ప్రస్తుతం ఆచార్య జయశంకర్ - వరంగల్ రూరల్ జిల్లాల పరిధిలోకి - గిరిజన - పర్యాటక - సాంస్కృతిక శాఖమంత్రి అజ్మీరా చందూలాల్ ములుగు నియోజకవర్గం ఆచార్య జయశంకర్ జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లాలో కలిసింది. అదేతోవలో సీనియర్‌నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం వరంగల్ జిల్లాతోపాటు మహబూబాబాద్ - జనగామ జిల్లాలలొ కలిసింది.
టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం. ఆయన హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఒక మండలం నేరెడుచర్ల నల్లగొండ జిల్లా పరిధిలో ఉండిపోగా మిగతా నాలుగు మండలాలు సూర్యాపేట జిల్లాలోకి వెళ్ళిపోయాయి. దశాబ్దాలుగా మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి అంటే గుర్తుకు వచ్చే పేరు సీనియర్ రాజకీయ నాయకుడు సూదిని జైపాల్ రెడ్డి. జిల్లాల విభజనలో ఆయన స్వగ్రామం మాడుగుల రంగారెడ్డి జిల్లాకు పోగా, కల్వకుర్తి నియోజకవర్గం నాగర్ కర్నూల్ జిల్లాలో చేరింది. టీటీడీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎ. రేవంత్ రెడ్డి స్వగ్రామం వంగూరు మండలం కొండారెడ్డి పల్లి నాగర్ కర్నూల్ జిల్లాలోకి వెళ్ళిపోగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో మూడు మండలాలు వికారాబాద్ జిల్లాలోకి వెళ్ళిపోగా రెండు మండలాలు మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉండిపోయాయి. అలాగే మంథని మాజీ ఎంఎల్ ఏ - పిసిసి ఉపాధ్యక్షుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్వగ్రామంతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ భూపాలపల్లికి మారింది. దశాబ్దాలుగా మంథని నియోజకవర్గంతో పాటు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ప్రభావం చూపించిన మాజీ స్పీకర్ శ్రీపాదరావు వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన కుమారుడు శ్రీధర్ బాబు ప్రస్తుతం వేరే జిల్లాకు మారడంతో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
హుస్నాబాద్ నియోజవర్గంలో ప్రస్తుత, మాజీ ఎంఎల్ ఏల పరిస్థితి మరీ విచిత్రం. ప్రస్తుత శాసనసభ్యుడు ఒడితెల సతీష్ బాబు స్వంత గ్రామం హుజూరాబాద్ మండలం సింగపూర్ కరీంగనగర్ లోనే కొనసాగుతోంది. ఆ నియోజకవర్గంలోని కొహెడ,హూస్నాబాద్ మండలాలు సిద్ధిపేటలోకి - భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాలు వరంగల్ అర్భన్‌లో పరిధిలోకి వెళ్ళిపోయాయి. ఆయన నియోజకవర్గంలోని ఒకే ఒక మండలం చిగురుమామిడి మాత్రమే కరీంనగర్ లో కొనసాగుతుంది. అదే నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్వగ్రామం చిగురుమామిడి మండలం రేకొండ కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుండగా నియోజకవర్గం మొత్తం సిద్దిపేట, వరంగల్ జిల్లాలో కలిసిపోయాయి. మరో మాజీ శాసనసభ్యుడు - ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంక్ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి స్వగ్రామం భీమదేవరపల్లి మండలం ములుకనూర్ వరంగల్ అర్బన్ జిల్లాలోకి వెళ్లిపోయింది. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ స్వగ్రామం పూర్వ కరీంనగర్ జిల్లాలోని జూపల్లికాగా శాసనసభ్యునిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లాలోకి, ఆయన స్వగ్రామం పెద్దపల్లి జిల్లాలోకి మారిపోయాయి.రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలవగా ఆయన పాలేరు శాసనసభ్యుడిగా ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్నారు. టిఆర్ ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు స్వగ్రామం పెనుబల్లి మండలంలోని బయ్యన్నగూడెం ఖమ్మం జిల్లాలో ఉండగా ఆయన కొత్తగూడెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ యోజకవర్గం భద్రాద్రి జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి వెళ్ళగా నియోజకవర్గం మూడుముక్కలైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రెండు మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి, మరో రెండు మండలాలు కొత్తగూడెం జిల్లాలోకి, మరో మండలం ఖమ్మం జిల్లాలోకి వెళ్ళిపోగా ఒకేఒక మండలం ఖమ్మం జిల్లాలో మిగిలిపోయింది. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్వగ్రామం సున్నంవారిగూడెం రాష్ట్ర విభజనలో తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్ళగా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్వగ్రామం వేలేరుపాడు పశ్చిమగోదావరి జిల్లాలోకి వెళ్లాయి.
ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మహేందర్ రెడ్డి స్వగ్రామం గొల్లూర్‌గూడెం వికారాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్ళింది. మేడ్చెల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్మారెడ్డి స్వగ్రామం శంకర్‌పల్లి మండలం మాసానిగూడ రంగారెడ్డి జిల్లాకు వెళ్ళగా ఆయన మాత్రం మేడ్చెల్ జిల్లాకు పరిమితమయ్యారు. చేవెళ్ళ ఎమ్మెల్యేగా ఉన్న యాదయ్య స్వగ్రామం నవాబ్‌పేట మండలం చించల్‌పేట్ ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ఉండగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలు రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నాయి. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం కామారెడ్డి జిల్లాలోకి వెళ్లింది.అలాగే నియోజకవర్గం రెండుగా విడిపోయి సగం నిజామాబాద్ జిల్లాలో మరో సగం కామారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చింది. శ్రీనివాసరెడ్డి స్వగ్రామం బాన్సువాడ మండలం పోచారం. ప్రస్తుతం ఈ గ్రామం కామారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లింది. ఆయన నియోజకవర్గంలోని బాన్సువాడ,బీర్కూర్ మండలాలు కామారెడ్డి జిల్లాలోకి వెళ్ళగా వర్ని, కోటగిరి మండలాలు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండిపోయాయి. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాఫేదర్ రాజు స్వగ్రామం నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్ ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోకి వెళ్ళింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/