``అన్ని హంగులతో కొత్త సెక్రటేరియట్...సీఎం కేసీఆర్ చొరవతో రాష్ర్టానికి రక్షణభూములు.. 38 ఎకరాల అప్పగింతకు కేంద్రం అంగీకారం...బదులుగా 518 ఎకరాల స్థలం.. రూ.90 కోట్లు...రాష్ట్రంలో కలెక్టర్ల కాన్ఫరెన్సుకూ తగిన హాలులేదు. శాఖల కార్యాలయాలు ఒక్కొక్కటి ఒక్కోచోట..ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు సీఎం యోచన...ఇందుకోసం ఖరారైన డిజైన్లు ఇవే``... రాష్ట్ర ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మాట ఇది. ఇందుకోసం ఖరారు చేసిన డిజైన్లు ఇవేనని సమాచారం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు ఇవి. అయితే అసలు డిజైన్లు ఇవి కాదంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తను అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త సచివాలయం కట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. వాస్తు కారణంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సెక్రటేరియట్ కట్టాలని కేసీఆర్ డిసైడయ్యారు. ఇందుకోసం డిజైన్లు ఖరారు అయ్యాయి. అయితే ఏపీ సర్కారు భూములు అప్పగించకపోవడం, చారిత్రక కట్టడాల కారణంగా ఆ పత్రిపాదన వెనక్కుపోయింది. అయినప్పటికీ కేసీఆర్ వెనక్కు తగ్గలేదు. డిఫెన్స్ భూములను సొంతం చేసుకొని సెక్రటేరియట్ కట్టుకోవాలనుకొని శతవిధాల ప్రయత్నం చేశారు. అనుకున్నట్లుగానే భూములను అప్పగించేందుకు కేంద్ర సర్కారు ఓకే చేసింది.
అయితే ఈ వెంటనే సెక్రటేరియట్ నిర్మాణం కోసం డిజైన్లు అంటూ మీడియాలో కొన్ని చిత్రాలు తెరమీదకు వచ్చాయి. అదే సమయంలో మంత్రి తుమ్మల సైతం వాటిని విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. కానీ కేసీఆర్ సన్నిహితవర్గాల ప్రకారం ఇవి కొత్తగా కట్టబోయే సెక్రటేరియట్ డిజైన్లు కాదట. గతంలో ట్యాంక్‌బండ్ ఒడ్డున కొత్త సచివాలయం కట్టే సమయంలో రూపొందించిన డిజైన్లుగా చెప్తున్నారు. వాటిని అదే రీతిలో కొత్త సెక్రటేరియట్ కోసం కేసీఆర్ ఒకే చేస్తారో లేదో అనేది సందేహం అని అంటున్నారు. కేంద్రం రక్షణ భూములు ఇచ్చిన తర్వాత సచివాలయం కొత్త డిజైన్ల విషయంలో కేసీఆర్ కసరత్తు చేయలేదని...పాత డిజైన్లను మార్చడం ఖాయమని అని చెప్తున్నారు.