ఎవరికి వారుగా విడిపోయిన తర్వాత ఎవరి బతుకులు వారివి అన్నట్లుగా ఉండటంలో తప్పేం లేదు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమన్నట్లుగా వ్యవహరించటం తప్పేం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే.. ఏపీ చరిత్ర పాఠాల్ని తొలగించేసి.. తెలంగాణ సాధన.. చరిత్ర.. సంస్కృతి లాంటి పాఠ్యంశాల్ని చేర్చింది.
ఇదిలా ఉంటే.. ఏపీలోనూ తెలంగాణకు సంబంధించిన పాఠ్యాంశాల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే.. తెలంగాణ మంత్రుల మొదలు.. నేతల వరకూ చాలానే వ్యాఖ్యలు చేసేశారు.
పాఠాల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలు తీసేస్తే.. తెలంగాణలో ఉన్న విగ్రహాలు కూడా లారీల్లో వేసి ఆంధ్రాకు పంపిస్తామంటూ బాధ్యతారాహిత్యమైన వాదనలు చేసిన నేతలూ ఉన్నారు. తెలంగాణ నేతల మాటలు కదిలించాయో.. లేక రాజకీయంగా ఉన్న ఇబ్బందులో కానీ.. ఏపీ సర్కారు తాను తీసుకున్న నిర్ణయం విషయంలో మనసు మార్చుకుంది. తెలంగాణ పాఠ్యాంశాల్ని తొలగించాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. తెలంగాణకు సంబంధించిన పాఠ్యంశాలు ఏపీ పిల్లలు చదివే పుస్తకాల్లో కంటిన్యూ అవుతాయని స్పష్టం చేయటం గమనార్హం. చూస్తుంటే.. ఏపీ పాఠ్య పుస్తకాల్లో ఉండాల్సిన పాఠాల గురించి తెలంగాణ నేతలు డిసైడ్ చేయటం ఏమిటో అన్న ప్రశ్నను సీమాంధ్రులు సంధిస్తున్నారు.