మోదీ పిలుపుతో లైట్లు ఒకేసారి ఆపేస్తే పరిస్థితి ఏంటి ?ట్రాన్స్ కో - జెన్‌ కో సీఎండీ ఏంచెప్పారంటే?

Update: 2020-04-04 12:14 GMT
కరోనావైరస్ ను దేశంలో అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తుంది. ఈ సమయంలో ప్రధాని మోదీ దేశ ఐక్యతని చాటడానికి ఒక పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రోజు కరోనా చీకట్లను తరిమేయాలి అంటూ పిలుపునిచ్చారు. ఆదివారం రోజు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లు ఆపేయాలని - ఆ  సమయంలో కొవ్వొత్తులు - దీపాలు - లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి  కరోనా చీకట్లను తరిమేయాలి అని ప్రధాని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో పలు అనుమానాలు తలెత్తడంతో కేంద్ర విద్యుత్‌ శాఖ వివరణ ఇచ్చింది. ఇళ్లలోని విద్యుత్‌ వస్తువులను స్విచ్చాఫ్‌ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాగే, ఆసుపత్రులు - అత్యవసర విభాగాల్లో లైట్లు బంద్‌ చేయాల్సిన పనిలేదన్నారు. వీధి లైట్లను బంద్‌ చేయాలని ఎటువంటి పిలుపు ఇవ్వలేదని - శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని వీధి లైట్ల ఆర్పొద్దని స్థానిక సంస్థలకు తెలిపింది.

అయితే, ఒకేసారి విద్యుత్‌ దీపాలను ఆర్పడం వల్ల పవర్‌ గ్రిడ్‌ కుప్పకూలిపోతుందని - వోల్టేజ్‌ హెచ్చుతగ్గులు తలెత్తి గృహోపకరణాలు పాడవుతాయన్న అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై తెలంగాణ ట్రాన్స్ కో - జెన్‌ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపివేయడం వల్ల తెలంగాణ పవర్ గ్రిడ్ పై ఎలాంటి ప్రభావం పడబోదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రిడ్ కు ఎలాంటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నాం అని - లైట్లు ఆపివేస్తే గ్రిడ్ కుప్ప కూలుతుంది అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. అలాగే ,సంబంధిత అధికారులకి జాగ్రత్తలు పాటించాలని, అలాగే  ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అలాగే ప్రజలందరూ కూడా ప్రభుత్వం చెప్పినట్టు - ఇళ్లల్లోనే ఉండి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.


Tags:    

Similar News