జాతీయ రాజకీఎయాలను ఒకనాడు ప్రభావితం చేసిన ఉమ్మడి ఏపీ ఈ రోజు రెండుగా మారింది. అయినా రాజకీయం ఇంకా పదునెక్కే ఉంది. అయిఏ అది కేవలం తెలుగు రాష్ట్రలకే పరిమితం కావడం విశేషం. ఇదిలా ఉండగా ఈ నెల 23న జాతీయ రాజకీయాలలో కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోంది.
పాట్నా వేదికగా బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆద్వర్యంలో ఈ నెల 23న యాంటీ మోడీ వేదిక కోసం అన్ని పార్టీలు కలవనున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చాక గత పదేళ్లలో ఎన్నడూ చోటు చేసుకోని కీలకమైన పరిణామం ఇది. ఈ సమావేశానికి దేశంలోని చాలా పార్టీలు హాజరవుతున్నాయి.
నిన్నటి దాకా కస్సుబుస్సులాడుకున్న పార్టీలు సైతం చేతులు కలపబోతున్నాయి. అందరిలోనూ ఒక్కటే భయం అదే మోడీ భయం. అందుకే వారిని ఆ భయం కలుపుతోంది. మరి ఈ అతి ముఖ్యమైన సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఒక్క పార్టీ హాజరు కాకపోవడమే విశేషంగా చూదాలని అంటున్నారు.
మరో వైపు 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా చోటు లేకుండా చేయాలన్న గట్టి పట్టుదలతో ఈ సమావేశం జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఓడించేందుకు దేశంలోని అన్ని బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ సమావేశం ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
ఈ సమవెశానికి కాంగ్రెస్ నుంచి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, తేజస్వీ యాదవ్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్ తదితర ప్రాంతీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక నేతలు, ముఖ్యామంత్రులు పాల్గొంటున్నట్లుగా ఇప్పటికే స్పష్టం చేశారు.
కానీ ఇంతటి రాజకీయ ప్రాధాన్యత కలిగిన సమావేశానికి ఏపీ తెలంగాణాల నుంచి ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ హాజరు కావడంలేఉ. ఏపీ తెలంగాణాలో ఘనత వహించిన పార్టీలే ఉన్నాయి. తెలంగాణాలో బీయారెస్ ఉంది. ఏపీలో చూస్తే వైసీపీ, టీడీపీ ఉంది. ఇక ఏపీలో వైసీపీని టీడీపీని కలిపి కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు అని బీజేపీ విమర్శలు చేస్తోంది.
అయినా కూడా బీజేపీతో దోస్తీకి ఈ రెండు పార్టీలు తహతహలాడడమే విశేషం. మరో వైపు చూస్తే ఆ మధ్య దాకా బీజేపీతోనే యుద్ధం అన్నట్లుగా మాట్లాడిన కేసీయార్ ఇపుడు తన కత్తిని కాంగ్రెస్ వైపు తిప్పారు. అదే సమయంలో బీజేపీ ని పల్లెత్తు మాట అనడంలేదు అన్న చర్చ కూడా సాగుతోంది.
ఆ మధ్యన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన కూతురు కవిత పేరు బయటకు రావడంతో కేసీఆర్ ఒక్కసారిగా బీజేపీపై మౌనం వహించారని కూడా ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలోనే పాట్నా సమావేశానికి దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది.
ఏది ఏపీ తెలంగాణా రాజకీయాల్లో కీలకమైన పార్టీలు పాట్నా మీటింగుకు దూరంగా ఉండడం జాతీయ స్థాయిలోనూ చర్చకు తావిస్తోంది. అందరూ మోడీకి యాంటీ కూటమి అంటూంటే మోడీతో దోస్తీ అంటోంది తెలుగు రాజకీయం ఇది విచిత్రమా లేక రాజకీయ వ్యూహమా అన్నదే అర్ధం కాని పరిస్థితిగా ఉంది.