దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? దేశంలో రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? ఎందులో వెనకబడ్డాం.. వేటిలో అభివృద్ధి చెందాం వంటి అంశాలతో దేశ ఆర్థిక స్వరూపాన్ని కళ్లముందు ఉంచేది ఆర్థిక సర్వే. ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల సమయంలో ఈ సర్వేను విడుదల చేస్తారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు ఈ సర్వేను బహిర్గతం చేస్తారు. ఇందులో భాగంగా జనవరి 31వ తేదీన దేశ ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సర్వేలో తెలుగు రాష్ట్రాలు జాతీయ స్థాయి లో హవా కొనసాగించాయి. అభివృద్ధి, సంక్షేమ తదితర అంశాల్లో జాతీయ స్థాయి లో తెలుగు రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయని ఈ సర్వే వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న రైతుబంధు పథకాన్ని సర్వేలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం అమలును వివరించింది. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.4 వేలు అందించే వినూత్న పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొంది. రైతుబంధు పథకం 2018 ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది. ఎరాకు సీజన్ కు రూ.4వేలు ఇచ్చారని, 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని రూ.5 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు 16 సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGs)లోను తెలంగాణ అగ్రస్థానాన ఉంది. రైతుబంధు పథకం స్ఫూర్తి తో రైతులకు ఆదాయ పరంగా, పెట్టుబడి పరంగా మద్దతు ఇచ్చేందుకు కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి, ఒడిశా కాలియా, జార్ఖండ్ ముఖ్యమంత్రి కృషీ ఆశీర్వాత్ పథకాలను అమలు చేస్తున్నాయని వెల్లడించింది.
లక్ష్యాల సాధనలో ముందు సుస్థిర లక్ష్యాలను సాధిస్తున్న రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. మొదటి స్థానంలో కేరళ ఉండగా ఆ తర్వాత స్థానాల్లో హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. టాప్ ఐదు లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. వీటికి తోడు పలు అంశాల్లో తెలుగు రాష్ట్రాలు ఇలా ఉన్నాయి..
- 2019 లెక్కల ప్రకారం అదనపు అటవీ విస్తరణ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని సర్వే వెల్లడించింది.
- చేపల ఉత్పత్తి లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానం లో నిలిచింది. ఏపీకి సమీపం లో ఏ రాష్ట్రం కూడా లేక పోవడం విశేషం.
- వన్ నేషన్, వన్ కార్డ్ కింద ఇంటర్ స్టేట్ పోర్టబులిటీ అమలవుతున్న 8 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి.
- వృద్ధి రేటులో కొన్నేళ్లుగా తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తోంది. ఈసారి కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. అయిదేళ్లలో సగటున 11.2 శాతం వృద్ధి రేటు తో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది. తర్వాత కర్ణాటక 10.5 శాతం, ఏపీ 9.8 శాతంతో ఉన్నాయి.
- పర్యాటకులను ఆకర్షిస్తున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు చోటు దక్కింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వరుస లో ఉన్నాయి.