ఇంకో దేశంలో మ‌న‌ విద్యార్థుల‌ కష్టాలు!

Update: 2017-02-09 17:07 GMT
తెలుగు విద్యార్థులు క‌ష్టాలు ఎదుర‌య్యే ప‌రంప‌ర‌లో మ‌రో దేశం చేరింది. ఇప్ప‌టికే వీసా నిబంధ‌న‌ల్లో మార్పుల‌తో కొంద‌రు విద్యార్థులు అమెరికాలో తీవ్ర ఇబ్బందులు ప‌డుతుండ‌గా మ‌రో చిత్ర‌మైన క‌ష్టాలు న్యూజిలాండ్‌ లో చోటు చేసుకున్నాయి. నిబంధ‌న‌ల పేరు చెప్తూ తమను క‌ష్టాల పాలు చేస్తున్న న్యూజిలాండ్ అధికారుల నుంచి న్యాయం చేయాలంటూ అక్క‌డ విద్య‌ను అభ్య‌సిస్తున్న విద్యార్థులు ఆంధ్ర- తెలంగాణ ప్రభుత్వాల్ని  అభ్యర్థిస్తున్నారు. తమ బాధల్ని వీడియో రూపంలో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి పెద్ద ఎత్తున స్పంద‌న రావ‌డం ఆస‌క్తిక‌రం.

న్యూజిలాండ్ అధికారులు కొత్త‌గా త‌మ‌ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు చూపించాల‌ని కోరుతున్నార‌ని, అంతేకాకుండా చ‌దువు పూర్తికాక ముందే నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే సాకుతో తమను అర్థాంతరంగా పంపించి వేయాలని చూస్తున్నార‌ని ఈ వీడియోలో స‌ద‌రు విద్యార్థులు వాపోయారు. చేయని నేరానికి తాము శిక్ష అనుభవిస్తున్నామని, ఈ విష‌యంలో తమకు సాయం చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని న్యూజిలాండ్ లో విద్య అభ్య‌సిస్తున్న స‌ద‌రు విద్యార్థులు కోరారు. న్యూజిలాండ్ అధికారుల తీరుతో ఇబ్బందుల‌కు గురైన విద్యార్థుల ఆవేద‌న‌తో కూడా ఈ వీడియోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. దీంతో సద‌రు విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను రెండు తెలుగు రాష్ర్ట ప్ర‌భుత్వాలు ప‌రిష్క‌రించాల‌ని మెజార్టీ నెటిజ‌న్లు కోరుతున్నారు.

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News