థియేటర్లు మూత పడ్డాయి. కొత్త సినిమాలు కూడా తగ్గి పోయాయి. లాక్ డౌన్ దెబ్బకు ఇంట్లో కూర్చోవడంతో అందరూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు అలవాటు పడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో.. నెట్ ఫ్లిక్స్ లాంటివాటిలో కూడా అందుబాటులో ఉన్న హిట్ సినిమాలను చూస్తున్నారు కానీ అన్నీ సినిమాలను ప్రేక్షకులు చూడడం లేదు.
విషయంలేని సినిమాలకు బదులుగా ఇతర భాషలైన కన్నడ.. మలయాళం.. హింది.. తమిళం.. ఇంగ్లీష్ భాషలలో మంచి రేటింగ్స్ ఉన్న సినిమాలను చూస్తున్నారు. ఇక వెబ్ ఫిలిం.. వెబ్ సీరీసుల విషయానికి వస్తే తెలుగు చాలా నీరసంగా ఉందనేది వాస్తవం. హిందీ.. ఇంగ్లీష్ వెబ్ సీరీస్ లు కొత్తదనం చూపిస్తూ ఈతరం మెచ్చే కంటెంట్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తున్నారు. కొన్ని వెబ్ సీరీసులు చతికిల పడినప్పటికీ కొన్ని మాత్రం సంచలనాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా లస్ట్ స్టోరీస్.. స్పెషల్ ఆప్స్.. ది ఫ్యామిలీ మ్యాన్ లాంటివి అటు కంటెంట్ పరంగా ఇటు క్వాలిటీ పరంగా సినిమా స్టాండర్డ్ కు తీసిపోని విధంగా ఉన్నాయి. అయితే తెలుగు వెబ్ సీరీస్ మాత్రం ఈ విషయం లో చాలా వెనకబడి ఉందని చెప్పక తప్పదు.
ఇప్పటివరకూ చాలానే వెబ్ సీరీసులు వచ్చాయి కానీ అన్నిటిలో విషయం తక్కువ. ఏదో 'విమర్శకుల ప్రశంసలు' అందుకునే ఒకటి అరా వెబ్ సీరీసులను పక్కన పెడితే మిగతా అంతా బీ గ్రేడ్ స్టఫ్. ఇలాంటి వాటిని సాధారణ ప్రేక్షకులు అసలు పట్టించుకోవడం లేదు. దీని బదులు హిందీ.. ఇంగ్లీష్ చూస్తున్నారు. ప్రేక్షకులు తెలుగులో ఒరిజినల్ కంటెంట్ కోసం సిద్ధంగా ఉన్నప్పటికీ.. మేకర్స్ మాత్రం ప్రేక్షకులను మెప్పించడం లో విఫలం అవుతున్నారు.
ఏదో ఒకటి తీస్తే చూస్తారు కదా అనే ధోరణి మానుకుని కొత్త తరం మెచ్చే కంటెంట్ తో వస్తేనే చూస్తారు అనేది నిజం. థియేటర్లో సినిమా అనుకోండి... టికెట్ కొన్న పాపానికి కనీసం ఇంటర్వెల్ వరకూ అయినా చూస్తారు. ఓటీటీ ప్రేక్షకుల వ్యవహారం అలా ఉండదు.. క్షణాల్లో "ఈ సోది చూడకూడదు" అనే నిర్ణయానికి వస్తారు. జస్ట్ అలా 'హోమ్' బటన్ ప్రెస్ చేసి మెనూ లో వేరే సినిమాను.. లేదా వెబ్ సిరీసును ఎంచుకుంటారు. టికెట్ కొనలేదు.. ఇరుక్కోలేదు కాబట్టి నో రిగ్రెట్స్! ఇది అలోచించి.. మనసులో పెట్టుకుని వెబ్ సీరీసులు.. వెబ్ ఫిలిమ్స్ రూపొందిస్తే మంచిది.