బాబు ఫస్ట్రేషన్ పీక్స్.. వల్లకాడు మాటలేంది?

Update: 2021-01-31 13:47 GMT
ఏపీ విపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. అధికారం ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు. మారుతూ ఉంటుంది. అంత మాత్రానికే నిరాశకు గురి కావటం.. ఎంత మాట పడితే అంత మాట అనేయటం చూస్తుంటే.. పవర్ తన చేతిలో తప్పించి ఇంకెవరి చేతిలో ఉన్నా.. నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? అన్న భావన కలుగక మానదు. ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్ని ఉద్దేశించి బాబు నోటి నుంచి వచ్చిన మాటలు విపరీతంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలిస్తే.. ఊళ్లన్నీ వల్లకాడుగా మారుతాయని మండిపడ్డారు. ఎన్నికల్లో ఏలా వ్యవహరించాలన్న అంశంపై ఏర్పాటు చేసిన టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్సులో 175 నియోజకవర్గాల ఇన్ చార్జులు.. ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బలవంతపు ఏకగ్రీవాల్ని అడ్డుకోవాలని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టటం అందరి బాధ్యతగా సందేశాన్ని ఇచ్చారు.

ప్రలోభాల్ని తిప్పి కొట్టాలని.. ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేయాలని చెప్పటం గమానార్హం. పంచాయితీ ఎన్నికల్ని ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకోవాలన్న ఆయన.. అధికారపక్షంపై దారుణ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుండాల చేతుల్లోకి మన గ్రామాలు వెళితే ప్రతి పల్లెకు కన్నీరే అని.. ప్రతి ఊరి బాగు మీ చేతుల్లోనే ఉందన్నారు. గ్రామాల్లో ప్రశాంతత కాపాడాలని.. అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గెలవకూడదన్న ఆయన.. వారు గెలిస్తే.. ఊళ్లు వల్లకాడుగా మారతాయన్నారు. సమర్థులైన వారే సర్పంచులుగా ఎన్నికయ్యేలా చూడాలన్నారు. ఇదంతా చూస్తే.. తమ పార్టీకి చెందిన వారు తప్పించి మరెవరు గెలిచినా.. ఇంతలా మాట్లాడటమా? అని ఆశ్చర్యపోతున్నారు. ఓటమి వేళ.. ఫస్ట్రేషన్ ఉండటం మామూలే అయినా.. మరీ ఇంతలా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News