పరిటాల ఫ్లెక్సీల కాల్చివేత.. అనంతపురంలో ఉద్రిక్తత

Update: 2021-01-24 13:00 GMT
అనంతపురంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవి వర్ధంతి సందర్భంగా కలకలం చెలరేగింది. పరిటాల రవి రాక్షసుడంటూ హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిని తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పరిటాల రవికి సంబంధించిన అంశంలో వివాదం చెలరేగడం ఇదే మొదటిసారి. పరిటాల రవి 16వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే కంబదూరం మండలంలోని కదిరిదేవరపల్లి గ్రామంలో పరిటాల రవి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఫ్లెక్సీల కాల్చివేతపై పరిటాల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పరిటాల రవి 16వ వర్ధంతి సందర్భంగా వెంకటాపురంలోని స్థూపం వద్ద ఆయన భార్య, మాజీ మంత్రి పరిటాల సునీత , కుమారుడు శ్రీరామ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీత తన మనవడితో చేతుల మీదుగా నివాళులర్పించారు. రవి వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రక్త, అన్నదానాలు చేస్తున్నామని సునీత చెప్పారు.

పరిటాల రవి ఆశయాలను కొనసాగిస్తామని సునీత తెలిపారు. పరిటాల ఫ్లెక్సీలను తగులబెట్టడంతో ఇప్పుడక్కడ టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


Tags:    

Similar News