తెలంగాణలో ఇప్పుడు ప్రతిదీ పెను వివాదంగానే మారిపోతోంది. ప్రభుత్వ పాలన కట్టుతప్పుతోందా? అన్న అనుమానాలను రేకెత్తేలా వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు టీఆర్ ఎస్ సర్కారు ప్రతిష్ఠను మసకబార్చడంతో పాటుగా పలువురు విద్యార్థుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. ఈ వ్యవహారం ఏ రియల్ ఎస్టేట్ రంగానికి చెందినదో అనుకోవడానికి లేదు. భావి భాతర పౌరులైన విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక పరీక్షల విషయంలో చోటు చేసుకుంటున్న ఈ వివాదాలు... కేసీఆర్ సర్కారుకు ఏ మేర దెబ్బస్తాయన్న అంశంపై ఇప్పుడు కొత్త వాదన మొదలైపోయింది. ఇంటర్ వాల్యూయేషన్ లో తప్పులతడకలు దొర్లిన నేపథ్యంలో 23 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ వివాదం తెలంగాణ వ్యాప్తంగా పెను కలకలమే రేపింది. ఈ వివాదం మంటలు ఇంకా పూర్తిగా చల్లారలేదనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో త్వరలో విడుదల కానున్న టెన్త్ ఫలితాల వ్యవహారంలో కూడా పెద్ద గోలే మొదలైపోయింది.
ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత అధికారుల నిర్లక్ష్యం బయటపడితే...టెన్త్ లో ఏకంగా ఫలితాలు విడుదల కాకుండానే బయటపడటం కలకలం రేపుతోది. టెన్త్ గోల ఏమిటన్న విషయానికి వస్తే... గత నెలలో మొదలైన టెన్త్ వాల్యూయేషన్ గత శుక్రవారంతో ముగిసిపోయింది వాల్యూయేషన్ ముగిసిన నేపథ్యంలో... టెన్త్ ఫలితాలను కూడా విడుదల చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోని ఖాజీపేటలోని ఫాతిమా హైస్కూల్ కేంద్రంగా జరిగిన వాల్యుయేషన్ కు అనర్హులైన ఇద్దరు ఉపాధ్యాయులు హాజరయ్యారట. ఈ విషయం కొన్ని ఉపాధ్యాయ సంఘాల ద్వారా క్యాంపు అధికారి - వరంగల్ అర్బన్ డీఈవో కె.నారాయణ రెడ్డికి తెలిసింది. దీంతో ఆ ఇద్దరు ఉపాధ్యాయులను గత నెల 20న మూల్యాంకన విధుల నుంచి తొలగించారు.
రాష్ట్ర పరిశీలకులైన వరంగల్ ఆర్ జేడీ పి.రాజీవ్ అంతర్గత విచారణ చేపట్టి అనర్హులతో వాల్యుయేషన్ చేయించడం నిజమేనని గుర్తించారు. అయితే అప్పటికే ఆ ఇద్దరు ఉపాధ్యాయులు ఐదు రోజుల పాటు వాల్యూయేషన్ విధులకు హాజరయ్యారని - ఈ క్రమంలో ఆ ఇద్దరు 523 జవాబు పత్రాలు దిద్దారని తెలిసింది. వాటిని 12 మంది ఏఈలతో వాల్యూయేషన్ చివరి రోజు శుక్రవారం మళ్లీ ప్రత్యేకంగా (రీవాల్యూయేషన్) చేయించేశారట. ఈ విషయాన్ని ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ రాజీవ్ అధికారికంగా ఒప్పేసుకున్నారు కూడా. ఓ వైపు ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల పెను దుమారమే రేగితే... ఇప్పుడు ఫలితాలు వెలువడకుండానే టెన్త్ పత్రాలను రీవాల్యూయేషన్ చేయించడం చూస్తుంటే... టెన్త్ లోనూ గోల తప్పదన్న వాదన వినిపిస్తోంది.