ప్రశాంతతకు మారుపేరైన కేరళలో ఘోరం చోటుచేసుకుంది. గతంలో ఎక్కడో జరిగిన సంఘటనను గుర్తుచేస్తూ అలాంటి ఘటనే జరిగింది. కదులుతున్న రైల్లోని ప్రయాణికుడికి నిప్పంటించడం.. ఆ తర్వాత పట్టాలపై ముగ్గురు చనిపోవడం దీనినే చాటుతోంది. మొత్తానికి ఈ ఘటన వెనుక ఉగ్ర వాద కోణం ఉందన్న వాదన వినిపిస్తోంది.
పెట్రోల్ పోసి నిప్పు..
కదులుతున్న రైల్లోని ప్రయాణికుడి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కేరళలో జరిగింది. తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగిన వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడు. కోపంతో ఊగిపోతూ సజీవ దహనానికి ప్రయత్నించాడు. ఒంటి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అవే మంటలు మిగతా ప్రయాణికులకు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఏడాది చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అలప్పుజ-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ రైలు కోజికోడ్ దాటింది. ఓ వంతెన మీదుగా వెళ్తున్న క్రమంలో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ పరిణామంతో మిగతావారు తీవ్ర ఆందోళన చెందారు. మంటలు కొందరిని అంటుకున్నాయి.
చైన్ లాగి..
ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికులు చైన్ లాగి రైలు ఆపేశారు. కొందరు ముందుకొచ్చి మంటల అంటుకున్నవారిని కాపాడారు. రైల్వే పోలీసులు వచ్చి గాయపడిన 8 మందిని ఆస్పత్రికి తరలించారు. ఇదంతా అయిపోయిన తర్వాత చూస్తే ముగ్గురు ప్రయాణికుల ఆచూకీ మిస్సయింది. గాలింపు నేపథ్యలో.. వంద మీటర్ల ఆవల వారి డెడ్ బాడీలు కనిపించాయి. వీరు ఏడాది పాప, ఓ పురుషుడు, ఓ మహిళగా గుర్తించారు.
అసలేం జరిగిందో?
ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవతో వీరు రైలు నుంచి దూకారా? లేదా జారిపడ్డారా? కిందకు దిగబోయి ప్రాణాలు కోల్పోయారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా వీరంతా ఒకే కుటుంబం వారని స్పష్టమవుతోంది. ప్రమాద ఘటనలో వీరికి ఏదైనా సంబంధం ఉందా? అని ఆరా తీస్తున్నారు.
నిందితుడు ఎక్కడ?
పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు ప్రమాదం తర్వాత పారిపోయాడు. ఇక ఎమర్జెన్సీ చైన్ లాగినందున రైలు ఏకంగా వంతెనపైనే ఆగిపోయింది. అప్పుడే అతడు రైలు దూకినట్లుగా అక్కడ చూసినవారు అనుమానిస్తున్నారు. ఇక ఆ నిందితుడి కోసం ఒకరు బైక్ పై వేచి చూస్తున్నాడని.. అతడి ద్వారానే నిందితుడు పారిపోయాడని చెబుతున్నారు. దీనికితోడు ఘటనా స్థలంలో ఓ బ్యాగు అనుమానస్పదంగా ఉండడంతో ఉగ్రవాద కోణంలోనూ విచారణ చేస్తున్నారు. అందులోనూ ఓ పెట్రోల్ సీసా, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అన్నిటికి మించి సహ ప్రయాణికుడితో నిందితుడు ఉద్దేశపూర్వకంగానే వాదనకు దిగినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.