ఊరంతా వినాయకచవితి పండుగ వేడుకల్లో నిమిగ్నమైన వేళ.. ముగ్గురు యువకులు జరిపిన దుశ్చర్యకు పద్నాలుగేళ్ల బాలిక బాధితురాలిగా మారింది. బాత్రూంకు వెళ్లిన ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి.. కొట్టి.. అత్యాచారం చేసిన వైనం షాకింగ్ గా మారింది.
బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. నిందితులు పరారీలో ఉన్నారు. తిరుపతిలోని కేవీబీపురం మండలానికి చెందిన తొమ్మిదో తరగతి చదివే బాలిక తల్లితో పాటు ఊళ్లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల్ని చూసేందుకు వెళ్దాం అనుకున్నారు.
అయితే.. బాలికకు కడుపునొప్పి రావటంతో రాత్రి పది గంటల వేళలో కుమార్తెను ఇంట్లో వదిలి వినాయక ఉత్సవాల్ని చూసేందుకు వెళ్లింది. పదకొండు గంటల వేళలో తిరిగి వచ్చి చూస్తే.. బాలిక కనిపించలేదు. ఊరంతా వెతికి.. చివర్లో అనుమానం వచ్చి బాత్రూంలో చూడగా.. అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసి షాక్ తిన్నారు.
ఏం జరిగిందని అడగ్గా.. తాను బాత్రూంకు వెళ్లిన సమయంలో సెల్వం.. గుణ.. అశోక్ ముగ్గురు తనన బలవంతంగా ఎత్తుకెళ్లారని.. దగ్గర్లోని శ్మశాన వాటికకు తీసుకెళ్లి కర్రతో గట్టిగా కొట్టారని.. తాను కింద పడిపోవటంతో గుణ.. అశోక్ లు అక్కడి నుంచి పారిపోతే.. సెల్వం తనను అత్యాచారం చేసినట్లుగా వాపోయింది.
అర్ధరాత్రి వేళలో తనను బాత్రూం వద్ద వదిలేసి వెళ్లిపోయినట్లుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ ఉదంతంపై పోలీసులు వెల్లడించిన వివరాలు వేర్వేరుగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాలికకు మత్తు ఇచ్చినట్లుగా పోలీసులు తొలుత పేర్కొన్నారు. తర్వాత మాత్రం కొట్టటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొనటం గమనార్హం. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. భయాందోళనలకు గురయ్యేలా చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.