మళ్లీ రెచ్చిపోయిన మావోలు ...ఆరు వాహనాలు దగ్ధం !

Update: 2020-06-25 15:00 GMT
ఛత్తీస్‌ గఢ్‌ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రెండు టిప్పర్లు, రెండు జేసీబీలు, మరో రెండు పోక్లైన్ల కాలిపోయాయి. సుక్మా జిల్లాలోని కుకనార్ ప్రాంతలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఎస్పీ శలభ్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 11.00 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఘటన జరిగిన సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక పోలీసులతో పాటు.. సీఆర్పీఎఫ్ బలగాలు కుకనార్ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి.

కాగా, మంగళవారం నాడు.. నారాయణ్పూర్ జిల్లాలో పేలిన ఐఈడీ బ్లాస్ట్‌ లో ఛత్తీస్‌ గఢ్ ఆర్మ్ ‌డ్ ఫోర్స్ ‌కు చెందిన ఓ జవాన్ గాయాలపాలయ్యాడు. ఇక మావోయిస్టులు ఇలా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న వాహనాలను తగులబెట్టడం ఇదేం మొదటి సారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలా వాహనాలను తగులబెట్టారు.
Tags:    

Similar News