గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఏదో సంచలన వ్యాఖ్యలు చేయడం వివాదాల్లో ఇరుక్కోవడం ఆయనకు అలవాటే. ఇందులో భాగంగా ఆయన ఓ సంచలన కామెంట్ చేస్తున్నారు. నన్ను ఉగ్రవాదులు చంపేస్తారేమోనని భయాందోళన వ్యక్తం చేయడం సంచలనం కలిగిస్తోంది.
తనను చంపేందుకు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆయనదో ప్రత్యేకమైన స్థానం కావడం గమనార్హం. పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు రాజాసింగ్ తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
గతంలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లు వస్తాయని చెప్పి అక్కడి వారిని భయపెట్టిన రాజాసింగ్ పై కేసు నమోదు కావడం తెలిసిందే.
అప్పటి నుంచి తనపై ఉగ్రవాదుల కన్ను ఉందని చెబుతున్నారు. తనకు ప్రాణ హాని ఉందని అది రాజకీయ పార్టీలతో కాదని ఉగ్రవాదులతోనే ఉందని తేల్చుతున్నారు. దీంతో ఎమ్మెల్యే మాటలపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తనకు ప్రమాదం ఉందని చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
త్వరలో తెలంగాణలో కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ కూడా ఓటు వేయకపోతే బుల్డోజర్లు వస్తాయని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే తనకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు తనని చంపడం ఖాయమేనని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీల్లో ఇది హాట్ టాపిక్ గా మారుతోంది. రాజాసింగ్ తీరుతో బీజేపీ కూడా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఓటర్లను భయపెట్టే విధంగా మాట్లాడితే అందరికి ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది.
ఇటీవల ఆయన అమర్ నాథ్ యాత్రకు వెళ్లి తృటిలో వరద ముప్పు నుంచి తప్పించుకున్నారు. ఈ విషయం స్వయంగా ఆయనే వెల్లడించారు. దీంతో తాను ఒక వర్గంపై చేసిన కామెంట్లకు వారు తనను చంపేస్తారని భయపడుతున్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా మాట్లాడటంపై అందరిలో సందేహాలు వస్తున్నాయి. కానీ రాజాసింగ్ తీరుతో పరిస్థితి ఎలా మారుతుందో తెలియడం లేదు. తనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఏర్పడుతోందని ఆయనే చెబుతుండటంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఏం చేసినా ఆయన వార్తల్లో నిలవడం తెలిసిందే.