ఎలాన్ మస్క్, టెస్లా భారత్ కి రావొచ్చు

Update: 2022-06-19 11:30 GMT
ఎలాన్ మస్క్, టెస్లాకు భారత్ ఆహ్వానం పలుకుతున్నట్లు కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ తెలిపారు. కానీ ఆత్మనిర్భర్ భారత్ విధానాల విషయంలో మాత్రం కేంద్ర సర్కార్ రాజీ పడబోదని స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్ లో టెస్లా తయారీ కేంద్రాలను స్థాపించే ఆలోచన లేదని ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. దానికి గల కారణాలు కూడా చెప్పారు.

ఎలాన్ మస్క్, టెస్లాను భారత్ స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. కానీ ఆత్మనిర్భర్ భారత్ విధానాల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదని స్పష్టం చేశారు. భారత్ లో మొదటగా టెస్లా కార్ల విక్రయాలు, సర్వీసులకు అనుమతించాలని.. ఆ తర్వాతే తయారీ కేంద్రం గురించి ఆలోచిస్తామని గతంలోనే ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.

తొలుత విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే భారత్‌లో విక్రయిస్తామని, ఆ తర్వాతే తయారీ యూనిట్‌ను స్థానికంగా నెలకొల్పుతామని టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ చెబుతూ వచ్చారు. దీంతో పాటు ఎలక్ట్రిక్‌ కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నారు. అయితే మస్క్ డిమాండ్లకు అంగీకరించని కేంద్రం.. కార్ల తయారీని భారత్లోని చేపట్టాలని స్పష్టం చేయడం వల్ల టెస్లాను భారత్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు బ్రేక్ పడింది. అయితే తాజాగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో టెస్లా మస్క్ భారత్ తో వ్యాపార కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో అమెరికా సహా పలు దేశాలకు సేవలందిస్తున్న స్టార్లింక్ ఇంటర్నెట్ భారత్లోకి అడుగుపెట్టడంపై కూడా మస్క్ స్పష్టతను ఇచ్చారు. త్వరలోనే భారత్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. కేంద్రం అనుమతే ఆలస్యమని చెప్పారు.
Tags:    

Similar News