టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ అంటే తెలియని వారుండమో.. ఆయనే మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పుడు ఆ ట్రబుల్ షూటర్ కే టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇటీవల మంత్రి పదవుల పంపకంలో హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యండిచ్చారు. దీంతో పార్టీలో కొంత వ్యతిరేకత వచ్చినా ఎవరూ కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. దీనిని ముందుగానే గ్రహించిన కేసీఆర్ అందుకు విరుగుడు కూడా ఆలోచించారు. హరీష్ రావు ఇమేజ్ ను తగ్గించడం.. అదే సమయంలో పార్టీలో గుర్తింపునిచ్చి దెబ్బతీయడం అనే ఫార్ములాను అనుసరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్ సభ కోసం వేసిన ఈ ప్లాన్ తో హరీష్ ను ఇరకాటంలో నెట్టేందుకు పక్యా వ్యూహాన్ని రచించారని సమాచారం.
టీఆర్ఎస్ లో కేసీఆర్ తరువాత అంతటి వ్యక్తిగా హరీష్ రావు తన ప్రాధాన్యాన్ని పార్టీలో పెంచుకున్నారు. కాగా టీఆర్ ఎస్ రెండోసారి అత్యధిక స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చాక క్రమేణ హరీష్ ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. కేసీఆర్ తనయుడికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి పార్టీని కేటీఆర్ చేతుల్లో పెట్టారు. తనతో మొదటి నుంచి ఉద్యమంలో, పార్టీలో క్రీయాశీలకంగా ఉంటున్న తన మేనల్లుడు హరీష్ రావుకు మాత్రం రెండోసారి అధికారంలో వచ్చాక మంత్రి పదవీ కూడా ఇవ్వలేదు. టీఆర్ ఎస్ లో ఇప్పుడు మంత్రి పదవి లభించిన వాళ్లంతా ఆయనకంటే తోపులా అంటే ఏమాత్రం కానేకాదు. దీంతో టీఆర్ ఎస్ లో కావాలనే హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారని పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి.
మంత్రి పదవి ఇవ్వకపోగా హరీష్ రావు సామర్థ్యానికి కేసీఆర్ ఓ పరీక్ష పెడుతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.. ఇటీవల కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తున్నారట.. ఖమ్మం, నల్గొండ లోక్ సభ బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులు విజయం సాధించే బాధ్యతను భుజాన పెడుతున్నాడట.. ఇది ఓ రకంగా హరీష్ రావుకి సవాలే అని చెప్పొచ్చు. ఎంపీ ఎన్నికలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు అక్కడి మోజార్టీ సాధించడం అనేది అంత తేలికైన విషయం కాదు. కాగా కాంగ్రెస్ గెలిచిన స్థానాలన్నీ ఆ పార్టీ సినీయర్లు గెలిచినవే. అక్కడ వారేంత చెబితే అంతే. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ గెలువడం దాదాపు కష్టమే. ఓ రకంగా అల్లుడిని మామ ఇరకాటంలో పెడుతున్నట్టే కనబడుతుంది.
దీంతో హరీష్ రావుకు పార్టీలో బాధ్యతలు ఇవ్వలేదన్న వ్యతిరేకత తగ్గుతుంది. అలానే అల్లుడిని ఇరకాటంలో పెట్టినట్లు ఉంటుందని కేసీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు. ఏదిఏమైనా ట్రబుల్ షూటర్ ట్రబుల్ ఇప్పట్లో తొలిగేలా కనిపించడం లేదు. మున్మందు హరీష్ రావు పరిస్థితి ఎలా మారుతుందోనని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. మామ పెట్టిన పరీక్షను అల్లుడి నెగ్గుతారా? లేక క్లీన్ బోల్డ్ అవుతారా అనేది వేచి చూడాల్సిందే మరీ..