ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయతీలు కాదు ప్రత్యేక హోదాయే కావాలని తెలుగుదేశం నాయకుడు - మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల కంటే రాయలసీమ - ఉత్తరాంధ్రలు వెనుకబడి ఉన్నాయని అన్నారు. అందుకే కేంద్ర, రాష్ర్ట పాలకులు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు డిమాండ్లు చేస్తున్నాయి కానీ ఆ హోదాయే దక్కితే ఏపీలో ప్రతిపక్షం పూర్తిగా కనుమరుగౌతుందని టీజీ వెంకటేశ్ అన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ వేసవి రాజధానిని సీమలో ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు టీజీ సూచించారు. లేకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు వస్తూనే ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు. రాయలసీమ- ఉత్తరాంధ్రల అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. హంద్రీనీవా సహా రాయలసీమ కు చెందిన సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.