చంద్రబాబు ఇంటి సమీపంలో షర్మిల మకాం.. !
సొంతగానే ఈ ఇంటిని నిర్మించుకుని.. అక్కడే కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా యి.
వైసీపీ అధినేత జగన్‌కు మరింత సెగ పెరగనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ లో కూర్చుని రాజకీయా లు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చీఫ్, జగన్ చెల్లెలు.. వైఎస్ షర్మిల.. ఇక నుంచి తన మకాంను అమరావతికి మార్చనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షర్మిల.. ఇంటి కోసం స్థలం అన్వేషిస్తున్నారు. సొంతగానే ఈ ఇంటిని నిర్మించుకుని.. అక్కడే కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా యి.
ప్రస్తుతం షర్మిల హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నివాసం ఉంటున్నారు. అవసరం ఉన్నప్పుడు ఏపీకి వచ్చి.. సంబంధిత జిల్లాల్లో కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. అయితే .. దీనివల్ల పార్టీ కేడర్‌కు సరైన దిశానిర్దేశం చేయలేకపోతున్న ఫీలింగ్ కలుగుతోంది. అదేవిధంగా సీనియ ర్ నాయకుల కదలికలపైనా షర్మిలకు పట్టు తప్పుతోంది. రాజకీయంగా కూడా.. ఆమె ఏపీలో రాజకీయా లు చేస్తూ.. హైదరాబాద్‌లో ఉండడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలోనే ఇక నుంచి నివాసం ఉండేలా షర్మిల పక్కా ప్లాన్ వేస్తున్నారు. తాజాగా చంద్రబా బు నివాసం ఉన్న ఉండవల్లి ప్రాంతంలోని భూములను ఆమె పరిశీలించారు. ఇక్కడ ఎకరం భూమిని కొనుగోలు చేసి.. అర ఎకరం స్థలంలో సర్వాంగ సుందరంగా ఇంటిని, అందులోనే కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఈ నివాసం.. సీఎం చంద్రబాబు ఉంటున్న నివాసానికి చేరువలోనూ.. జగన్ నివాసానికి కూతవేటు దూరంలోనూ ఉండనుంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏపీలోని విజయవాడలోనే ఉంది. పైగా ఇది చిన్నదిగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కార్యాలయం అవసరం పార్టీకి ఉంది. ఈ క్రమంలో తన ఇంటిని+ కార్యాలయాన్నికలిపి ఒకేచోట నిర్మించడం ద్వారా.. అటు పార్టీకి, ఇటు తనకు కూడా.. ఇబ్బందులు తప్పుతాయన్నది షర్మిల ఆలోచనగా ఉంది. పైగా.. స్టేట్‌లోనే ఉంటే.. నిత్యం నాయకులకు, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండొచ్చని ఆమె యోచిస్తున్నారు.