ఈ ఎమ్మెల్యేల ఆవేదన చంద్రబాబు వినలేరా ..!
గత రెండు రోజులుగా గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, చిలకలూరి పేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులు పదే పదే వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.;
టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలు .. సీఎం చంద్రబాబు వైఖరిపై పెదవి విరుస్తున్నారు. గతంలో తమను ఇ బ్బంది పెట్టి.. కేసులు కట్టి.. జైల్లో పెట్టించిన వైసీపీ నేతలపై ఇప్పుడు అదే విధానంతో ముందుకు సాగాల న్నది వారి ఆలోచన. కానీ, దీనికి చంద్రబాబు పెద్దగా మొగ్గు చూపడం లేదు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పదే పదే వైసీపీ ప్రస్తావన తీసుకువస్తూ.. సర్కారు చెవిలో జోరీగ మాదిరిగా ఇంత అక్రమాలు చేసినా వైసీపీ నేతలను కట్టడిచేయలేక పోతున్నారన్న చర్చ తెరమీదికి వచ్చేలా చేస్తున్నారు.
గత రెండు రోజులుగా గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, చిలకలూరి పేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులు పదే పదే వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. కార్పొరేషన్లను నిర్వీర్యం చేశార ని, నిధులు ఇష్టానుసారంగా మళ్లించారని.. దీనికి కారణమైన వైసీపీ మాజీ మంత్రులపై కేసులు పెట్టాలని ధూళిపాళ్ల కోరుతున్నారు. ఇది వాస్తవమే. గతంలో కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. అన్యాయం, అక్రమాలు కూడా చేసి ఉండొచ్చు. కానీ, వీటికి బలమైన ఆధారాలు లేకుండా పోయాయి.
ఇక, ప్రత్తిపాటి పుల్లారావు కూడా.. గతంలో వైద్య పరికరాల కొనుగోలు, వైద్యుల బదిలీల వ్యవహారంలో అక్ర మాలు జరిగాయంటూ.. మాజీ మంత్రి విడదల రజనీని పరోక్షంగా ఆయన కార్నర్ చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం అంతర్గతంగా విచారణ జరుగుతోంది. అయితే.. వాస్తవం ఎలా ఉన్నా.. సదరు ఇద్దరు ఎమ్మెల్యేల ఆవేదన వేరేగా ఉంది. గతంలో వైసీపీ హయాంలో సంగం డెయిరీ పేరుతో.. ధూళిపాళ్లను వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించింది.
కొన్ని రోజులు ఆయన జైల్లో కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కుమార్తె బయటకు వచ్చి పోరాటం కూడా చేశారు. అప్పట్లో తనను జైలు పాలు చేసిన వ్యక్తి.. ప్రస్తుతం వేరే పార్టీలో ఉన్నారు దీనిని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే వేరే వేరే అంశాలను స్పృశిస్తూ.. అయినా.. తనను పట్టించుకో వాలని కోరుతున్నారు. ఇక, ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడిపై గతంలో జీఎస్టీ కేసులు పెట్టారు. ఇది అప్పట్లో పెను దుమారం రేగింది. ఈ నేపథ్యం వెనుక అప్పటి మంత్రి రజనీ ఉందని ప్రత్తిపాటి ఆరోపిస్తున్నారు. కానీ, చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ.. వేర్వేరు పంథాల్లో సర్కారు స్పందించేలా చేస్తుండడం గమనార్హం.