కుమార్తెను ఉరి తీయమంటున్నపేరెంట్స్... చేసిన పని అలాంటిది!

ఈ తాజా ఘటనలో భర్త తనను డ్రగ్స్ తీసుకోవద్దన్నందుకు తన ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసింది! ఈ ఘటన యూపీలో సంచలనంగా మారింది.;

Update: 2025-03-20 03:59 GMT

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదురు కొంటున్న మీరట్ మహిళ.. తన తల్లితండ్రుల ముందు అసలు విషయం చెప్పింది. తనను డ్రగ్స్ తీసుకోకుండా ఆపినందుకే భర్తను చంపినట్లు ఒప్పుకుందని ఆమె తండ్రి తెలిపారు! దీంతో.. నిందితురాలి తల్లితండ్రులు అల్లుడి కుటుంబానికి అండగా నిలిచారు. తమ కుమార్తెకు ఉరిశిక్ష సరైందని అంటున్నారు.

అవును... ఇటీవల కాలంలో భార్యలు పెట్టే హింసలు భరించలేక సెల్ఫీ వీడియోలు తీసుకుని చాలా మంది భర్తలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ తాజా ఘటనలో భర్త తనను డ్రగ్స్ తీసుకోవద్దన్నందుకు తన ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసింది! ఈ ఘటన యూపీలో సంచలనంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్ కి చెందిన ముస్కాన్ రస్తోగి, సౌరభ్ రాజ్ పుత్ లు 2016లో ప్రేమ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో... సౌరభ్ మర్చంట్ నేవీలో పనిచేయడంతో.. ఎక్కువ సమయం భార్యకు కేటాయించడానికి వీలుండేది కాదట. దీంతో.. అతడు ఆ ఉద్యోగాన్నే వదిలేశారు. అయితే.. అది అతడి కుటుంబానికి ఏమాత్రం నచ్చలేదు.

దీంతో... తల్లితండ్రులకు విడిగా ఉంటూ భార్యతో కలిసి బయట వేరు కాపురం పెట్టారు. ఈ క్రమంలో వారికి ఒక కుమార్తె జన్మించింది. ఈ క్రమంలో... రస్తోగికి తన చిన్ననాటి స్నేహితుడు సాహిల్ శుక్లా పరిచయమయ్యాడు. ఇది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్ధరినీ మరింత దగ్గర చేసింది డ్రగ్స్ అని చెబుతున్నారు!

అయితే... ఈ అక్రమ సంబంధం ఎక్కువ కాలం దాగలేదు! వీరి వ్యవహారం సౌరభ్ కు తెలిసిపోయింది. దీంతో... ఇంట్లో గొడవలు మొదలై, వ్యవహారం విడాకుల వరకూ వెళ్లింది. అయితే... కుమర్తె గురించి ఆలోచించిన సౌరభ్... ఆ ఆలోచనను విరమించుకున్నాడు. తర్వాత తిరిగి మర్చంట్ నేవీలో చేరి, అమెరికా వెళ్లిపోయారు.

ఈ క్రమంలో... గత నల సౌరభ్ తిరిగి భారత్ కు వచ్చాడు. కారణం... తన కుమార్తె పుట్టినరోజు! దీంతో.. అతడి అడ్డు తొలగించుకోవాలని భార్య ముస్కాన్ భావించి, ఓ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా... అతడికి తినే ఆహారంలో మత్తు మాత్రలు కలిపింది. దీంతో.. అతడు గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. వెంటనే.. ప్రియుడు సాహిల్ శుక్లా ఎంట్రీ ఇచ్చాడు.

ఇద్దరూ కలిసి సౌరభ్ ను చంపేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని 15 ముక్కలుగా కోసి, ఫ్లాస్టిక్ డ్రమ్ లో వేసి సీల్ చేశారు. ఈ సమయంలో ఎవరైనా సౌరభ్ గురించి అడిగితే.. అక్కడకు వెళ్లారు, ఇక్కడకు వెళ్లారని సాకులు చెప్పేది ముస్కాన్. పైగా అతడి సోషల్ మీడియాలో పాత ఫోటోలు పోస్ట్ చేస్తూ, అతడు యాక్టివ్ గా ఉన్నట్లు సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది.

దీంతో.. ఇండియా వచ్చి ఎన్ని రోజులైనా తమ కుమారుడితో ఫోన్ కూడా మాట్లాడటానికి వీలుకాకపోవడంతో సౌరభ్ కుటుంబానికి అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో... తామే హత్య చేసినట్లు ముస్కాన్, సాహిల్ శుక్లా అంగీకరించారు. సిమెంట్ నింపిన డ్రమ్ లో ఉన్న సౌరభ్ శరీర భాగాలను శవపరీక్షలు పంపారు పోలీసులు.

ఈ ఘటనపై ముస్కాన్ పేరెంట్స్ మాట్లాడుతూ... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తమ కుమార్తెను సౌరభ్ గుడ్డిగా ప్రేమించాడని తెలిపారు. అయితే.. ఆమె చేసిన పనికి ఆమెను కఠినంగా శిక్షించాలని.. ఆమె జీవించే హక్కును కోల్పోయిందని.. ఆమెకు ఉరే సరి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు డ్రగ్స్ వాడే అలవాటుందని తండ్రి వెల్లడించారు.

Tags:    

Similar News