బాబు మార్కు సలహాదారులు.. చాలా డిఫరెంట్ ..!
ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా సలహాదారులకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం తాజాగా నలుగురిని నియమించడంతో మొత్తం సలహాదారుల సంఖ్య 70కి చేరింది.;
ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా సలహాదారులకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం తాజాగా నలుగురిని నియమించడంతో మొత్తం సలహాదారుల సంఖ్య 70కి చేరింది. వాస్తవానికి వైసీపీ హయాంలోనూ పెద్ద సంఖ్యలో సలహాదారులను నియమించారు. అయితే.. అప్పట్లో ఈ నియామ కాలు భారీ వివాదాలకు విమర్శలకు కూడా దారితీశాయి. దీనికి కారణం.. అవి రాజకీయంగా.. కుల ప్రాతిపదికన చేపట్టినవేని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఇక, ఇప్పుడు తాజాగా చేసిన నలుగురి నియామకాలతో కూటమి ప్రభుత్వం 70 మందిని సలహాదారులుగా నియమించింది. వీరిలో మాజీ ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. అయితే.. ఈ రేంజ్‌లో సలహాదారు లను నియమిస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ, సలహాదారుల సంఖ్య 70కి చేరడం గమనార్హం. తాజాగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులను ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించిం ది. వీరిలో అత్యంత ప్రముఖులు ఉండడం గమనార్హం.
అంతరిక్ష సాంకేతిక రంగ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్, ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీ సలహాదారుగా డాక్టర్ సతీష్‌రెడ్డిని నియమించింది. అదేవిధంగా చేనేత, హస్తకళల అభి వృద్ధికి సంబంధించి సలహాలు ఇచ్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లాను, ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీని నియమించింది. వీరందరికీ కేబినెట్ హోదాను కల్పించిన ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. వైసీపీ హయాంలో చేపట్టిన సలహాదారుల నియామకానికి.. ప్రస్తుతం చంద్రబాబు హయాంలోని కూటమి ప్రభుత్వం చేపట్టిన సలహాదారుల నియామకానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వైసీపీ ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రాలుగా సలహాదారులను వినియోగించుకుందన్న విమర్శలు వుంటే.. ఇప్పుడు చంద్రబాబు ఆచితూచి అడుగులు వేశారు. ఎక్కడా విమర్శలు రాకుండా పలు రంగాల్లో నిష్ణాతులను నియమించారు. ఇలా.. బాబు మార్క్ సలహాదారుల నియామకంతో విమర్శలకు తావు లేకుండా పోయింది.