మాకొక ప్రత్యేక రాష్ట్రం కావాలి!

Update: 2015-08-27 04:37 GMT
ప్రత్యేక రాష్ట్ర డిమాండ్  కేవలం భారత్ లోనే అనుకుంటే పొరపాటే... ఇది చాలా దేశాల్లో ఉంటుంది. తాజాగా పక్కదేశం నేపాల్ లో కూడా మొదలైంది. అన్యాయానికి గురవుతున్నాం... వివక్షను ఎదుర్కొంటున్నాం... అంటూ థరూ జాతి ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉధ్యమానికి తెరతీశారు. ఈ ఉధ్యమం రోజు రోజుకీ హింసాత్మకంగా మారుతుంది!

నేపాల్ లో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం.. "నూతన రాజ్యాంగం" ప్రవేశపెడతామని ప్రకటించడంతో... తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించే సదావకాశం వచ్చిందని భావించిన థరూ జాతి ప్రజలు... ఆ రాజ్యాంగంలో తమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేలా పేర్కోవాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అయినా కూడా కొత్త ప్రభుత్వం వీరి డిమాండ్ ను పరిగణలోకి తీసుకోకుండా... కొత్త రాజ్యాంగాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీంతో వీరి ఆగ్రహం కట్టలు తెంచుకుంది!

తాజాగా కైలాలో ప్రాంతంలో కర్ఫ్యూ నిర్వహిస్తున్న పోలీసులపై థరూ ప్రజలు ఒక్కసారిగా దాడిచేసి ఏకంగా ఏడుగురు పోలీసులను చంపేశారు. వీరిలో కొంతమందిని కత్తులతో పొడిచి చంపగా... ఒకరిని సజీవ దహనం చేశారు. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారో తెలియదు కానీ... పక్కనున్న భారత్ ఎంచుకున్న అహింసాపద్దతిని మాత్రం వీరు ఎంచుకోలేదు. ఫలితంగా ప్రస్తుతం నేపాల్ లో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి!
Tags:    

Similar News