28 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన బైడెన్ ..ఏంటంటే ?

Update: 2020-11-15 01:30 GMT
జో బైడెన్ .. కాబోయే అమెరికా అధ్యక్షుడు. మరోసారి అమెరికా పీఠం అందుకోవాలని కలలు కన్న ట్రంప్ కి చుక్కలు చూపిస్తూ , ఎన్నికల ప్రచారం నుండే పై చేయి సాధించి , చివరికి ఎన్నికల్లో కూడా ట్రంప్ కి దిమ్మతిరిగేలా షాక్ ఇస్తూ , విజయం అందుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే , అధ్యక్షుడిగా గెలిచిన బైడెన్ 28 ఏళ్ల ఓ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. అదేమిటి అంటే ..జార్జియా లో విజయం. జార్జియాలో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ చారిత్రాత్మక విజయం సాధించారు.

ఈ విజయంతో బిల్ క్లింటన్ తర్వాత అరుదైన ఘనత బైడెన్ ‌కు దక్కింది. 1992లో చివరిసారిగా డెమొక్రటిక్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో బిల్ క్లింటన్ గెలిచారు. క్లింటన్ తర్వాత డెమొక్రట్స్ ఇక్కడ గెలవలేదు. దీంతో ఈ రాష్ట్రం రిపబ్లికన్స్‌కు కంచుకోటగా మారింది.
కానీ, ఈఎన్నికల్లో ఈ పరంపరను బైడెన్ బ్రేక్ చేశారు. బిల్ క్లింటన్ తర్వాత జార్జియాలో గెలిచి చరిత్ర సృష్టించారు. శుక్రవారం జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. జార్జియాలో బైడెన్ గెలవగా... నార్త్ కరోలినాలో ట్రంప్ విజయం సాధించారు. జార్జియాలో బైడెన్ ‌కు 49.5 శాతం ఓట్లు పోలవగా.. ట్రంప్‌కు 49.2 ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ 14,152 ఓట్ల తేడాతో ట్రంప్‌ను ఓడించారు.

దేశవ్యాప్తంగా మొత్తం కౌంటింగ్ 97 శాతం పూర్తి కాగా... బైడెన్ ‌కు 50.8 శాతం ఓట్లు వస్తే.. ట్రంప్‌కు 47.4 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో 3.4 శాతం ఓట్ల తేడాతో ట్రంప్ ‌ను బైడెన్ ఓడించారు. ఇక మొత్తం ఫలితాలు వచ్చేసరికి బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే.. ట్రంప్ 232 ఓట్లు మాత్రమే సాధించారు. అయితే ఇక్కడ ఒక యాధృచ్ఛికత చోటు చేసుకుంది. అదేంటంటే... 2016లో ట్రంప్ సాధించిన మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 306 కాగా, డెమొక్రటిక్ పార్టీ తరఫున బరిలో దిగిన హిల్లరీ క్లింటన్ 232 ఎలక్టోరల్ ఓట్లు గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా ఇవే డిజిట్స్ రిపీట్ అయ్యాయి. కాకపోతే తారుమారు అయ్యాయి.
Tags:    

Similar News