కొన్ని అంశాల మీద కోట్లాది భారతీయుల మాట ఒకటేలా ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దేశ వ్యాప్తంగా ఉన్న 400 సంస్థానాల్ని ఒక తాటి మీదకు తీసుకొచ్చి.. లెక్కలు తేల్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు జమ్ముకశ్మీర్ ఇష్యూను అప్పజెప్పి ఉంటే.. భారత్ దిశ.. దశ మరోలా ఉండేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. కశ్మీర్ సంస్థానాన్ని జవహర్ లాల్ నెహ్రూ టేకప్ చేయటం.. నాడు వ్యవహరించిన తీరుకు బదులుగా నేటి వరకు అందరూ అనుభవించాల్సిన పరిస్థితి. మోడీ సర్కారు రెండోసారి కొలువు తీరిన తర్వాత.. అప్పట్లో జరిగిన తప్పును ఆర్టికల్ 370ను సుప్త చేతనావస్థలో ఉంచటంతోసరి చేశారన్న అభిప్రాయాన్ని భారతీయులు తరచూ వ్యక్తం చేస్తుంటారు.
ఇలాంటి మాటలు చాలా సందర్భాల్లో సగటుజీవుల నోటి వెంట వచ్చినా.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి అస్సలు వినిపించవు. తాజాగా ఆ లోటును తీర్చేశారు ప్రధాని మోడీ. సర్దార్ పటేల్ 145వ జయంతి సందర్భంగా ఏకతా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో గుజరాత్ లోని కెవాడియా వద్ద ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. దేశ ప్రజలంతా కనెక్టు అయ్యేలా ఉండటం గమనార్హం.
‘‘నాడు సర్దార్ పటేల్ కు కానీ అనుమతి ఇచ్చి ఉంటే కశ్మీర్ సమస్య అనాడే ఆయన పరిష్కరించి ఉండేవారు.ఆయన ప్రారంభించిన పని పూర్తి చేయటానికి నాకు అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నా. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ను రద్దు చేసి ఏడాది పూర్తైంది. ఇదే కాదు.. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణంలో ఆయన ప్రారంభించారు. ఆ స్ఫూర్తిని మేం కొనసాగిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఇంత ఓపెన్ గా నెహ్రూ చేసిన తప్పును వేలెత్తి చూపించిన ప్రధాని మోడీనే అని చెబుతున్నారు. అంతేకాదు.. పుల్వామా దాడిని పాక్ మంత్రి పార్లమెంటులో ప్రస్తావించిన వైనంపై మాట్లాడుతూ. నాడు పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు చనిపోయారని.. దేశం యావత్తు మౌనంగా రోదిస్తుంటే.. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం నీచంగా మాట్లాడారు. ఆ దాడిపై అనుమానాలు వ్యక్తం చేశారు. పాక్ తాజాగా పార్లమెంటులో అంగీకరించటంతో.. రాజకీయ లబ్థి కోసం ఏమైనా చేస్తారన్న భావన కలుగుతోంది. విపక్షాలను తాను కోరేది ఒక్కటేనని.. తెలిసి కానీ.. తెలియక కానీ జాతి వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చేలా మాట్లాడొద్దని చెప్పిన మాటలు రాజకీయ పక్షాలకు దిమ్మ తిరిగే షాకిచ్చేలా ఉన్నాయని చెప్పక తప్పదు.