కోర్టుకి చేరిన ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి .. కోర్టు ఏంచెప్పిందంటే ?

Update: 2020-10-09 12:15 GMT
34 ఏళ్ల ఓ  దళిత ఎమ్మెల్యే, 19 ఏళ్ల అగ్రకుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తమిళనాట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన కుమార్తెకు, సదరు ఎమ్మెల్యేకు వయసు రీత్యా చాలా తేడా ఉందని, అలాగే ,  తనను బెదిరించి తన కుమార్తె ను  కిడ్నాప్ చేసి  బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె తండ్రి స్వామినాథన్ మద్రాస్ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే , దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అయితే అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు ప్రేమ వివాహం చెల్లుతుందని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇద్దరు మేజర్లు కావడంతో వారి వివాహాన్ని తాము అడ్డుకోలేమని కోర్టు వెల్లడించింది.

 గత కొన్నేళ్లుగా సౌందర్య అనే యువతి, ఎమ్మెల్యే ప్రభు ప్రేమించుకుంటున్నారు. అయితే, ఆయన దళితుడు కావడంతో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సౌందర్య తల్లిదండ్రులు ఈ పెళ్లి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ప్రభు యువతిని తీసుకెళ్లి సోమవారం ఉదయం రహస్యంగా వివాహం చేసుకున్నాడు. దీనిని సహించని అమ్మాయి తండ్రి ఎమ్మెల్యే ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఆయన ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. దీంతో సదరు ఎమ్మెల్యే తన కూతురు సౌందర్యను కిడ్నాప్ చేసి, బెదిరించి వివాహం చేసుకున్నాడని యువతి తండ్రి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం స్వామినాథన్ ఆరోపణలపై సౌందర్య వివరణ కోరింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగానే ప్రభును పెళ్లి చేసుకున్నానని చెప్పింది. దీనితో ఆ ఇద్దరు మెజర్స్ కావడంతో ఈ పెళ్లి చెల్లుతుంది అని కోర్టు తీర్పు ఇస్తూ స్వామినాథన్ పిటిషన్ ను తోచిపుచ్చింది.
Tags:    

Similar News