ఆ ఒక్కటి ఎప్పటికీ బాధిస్తూనే ఉంటుంది : రతన్ టాటా !

Update: 2021-07-12 04:30 GMT
రతన్‌ టాటా .. దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరు.  రతన్ టాటా గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకు దేశవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటే తత్వం ఈయనకు ఇతరుల కన్నా ప్రత్యక స్థానం అందించింది. టాటా గ్రూప్‌‌ కు గౌరవ చైర్మన్‌ గా ఉన్నా ఈయన అందరికీ ఆదర్శమని చెప్పవచ్చు. ఎంత ఎత్తుకి ఎదిగినా  ఎలాంటి గర్వం ఉండదు. చాలా సాధారణమైన జీవనాన్ని కొనసాగిస్తారు. అయన తన జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్న నేటికీ ఒక విషయంలో మాత్రం ఇప్పటికీ  భాదపడుతున్నారట.

అదేమిటి అంటే .. తనకెంతో ఇష్టమైన ఆర్కిటెక్చర్‌ వృత్తిని వదిలేసి వ్యాపారం రంగంలో అడుగుపెట్టాల్సి వచ్చిందని, ఆర్కిటెక్చర్‌ లో డిగ్రీ పొందినా, ఆ వృత్తిలో కొనసాగపోవడం తనను బాధిస్తుంటుందని రతన్‌ టాటా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రతన్‌ టాటా కు ఆర్కిటెక్ట్‌ అవ్వాలని ఓ బలమైన కోరిక ఉండేది. కానీ, ఆయన తండ్రి రతన్‌ టాటా ను ఇంజినీర్‌ను చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్‌ కాలేజీలో కూడా చేర్పించారు. కానీ, రతన్‌ ఆర్కిటెక్చర్‌ పై ఆసక్తితో ఇంజినీరింగ్‌ కోర్సును వదిలేసి 1959లో న్యూయార్క్‌ లోని కొర్నెల్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ డిగ్రీలో జాయిన్ అయ్యారు. ఆ  కోర్సు పూర్తి చేసుకొని పట్టా పొందిన ఆయన.. లాస్‌ ఎంజిలెస్‌ లోని ఓ ఆర్కిటెక్ట్‌ కంపెనీలో  కొన్ని రోజుల పటు ఉద్యోగం కూడా చేశారు.

కానీ, రతన్ టాటా ఒకటికి తలిస్తే  విధి మరొకటి తలచింది, ఆయన్ను వ్యాపార రంగంలోకి నెట్టింది. తండ్రి నుంచి టాటా సంస్థ బాధ్యతలు తీసుసుకోవాల్సి రావడంతో తనకిష్టమైన ఆర్కిటెక్ట్‌ వృత్తిని ఇష్టం లేకున్నా కూడా వదిలేయాల్సి వచ్చింది. అందుకే, తాను ఒక ఆర్కిటెక్ట్‌ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడను కానీ, ఆర్కిటెక్ట్‌గా కొనసాగపోవడం పట్ల చింతిస్తుంటానని రతన్‌ టాటా అన్నారు. ఆర్కిటెక్చర్‌ వృత్తికి దూరంగా ఉన్నా, ఆ కోర్సులో నేర్పించిన పాఠాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని రతన్‌ టాటా తెలిపారు.  అన్నింటిని ఒక్క చోటకు చేర్చే, ఇచ్చిన బడ్జెట్‌ లో ప్రాజెక్టు పూర్తి చేయగలిగే సామర్థ్యం, వివిధ రూపాల్లో వచ్చే చిక్కులను ఎదుర్కొనే సామర్థ్యం వంటి అంశాలను ఆర్కిటెక్చర్‌ కోర్సులో బాగా బోధించారు అని తెలిపారు. ఎవరైనా ఒక ఆర్కిటెక్ట్‌ వ్యాపారవేత్త కాలేరు అని అంటే ఆ వ్యాఖ్య సరైంది కాదంటూ ఖండిస్తాననని రతన్‌ టాటా తెలిపారు.

 80 సంవత్సరాల ఈ టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాకు జంతువులు అంటే, ముఖ్యంగా కుక్కలు అంటే ఎంత ప్రేమో చెప్పాల్సిన పనిలేదు. కుక్కల మీద ఆయన ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఇన్ స్టా గ్రామ్ పోస్టులను గమనిస్తే ఆయనకు కుక్కల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు బుజ్జి బుజ్జి కుక్క పిల్లల ఫొటోలను షేర్ చేస్తున్నారు. అలాగే, కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపండి అంటూ అందరిలోనూ చైతన్యం నింపుతున్నారు. ముఖ్యంగా గాయపడిన కుక్కలు, వీధి కుక్కల మీద ప్రేమ చూపాలని కోరుతున్నారు. రతన్ టాటా కరోనా సమయంలో దేశానికి భారీ సాయం అందించారు.  వైరస్‌ పోరులో అనునిత్యం శ్రమిస్తున్న వారికి, బాధితులకు సాయం కోసం రూ.500 కోట్లు ఖర్చు కేటాయించాలని నిర్ణయించామని ఆయన వివరించారు. వైరస్‌ బాధితులకు సేవలందించే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి, బాధితులకు వైద్య పరికరాలు, వైరస్‌ పరీక్షలకు టెస్టింగ్‌ కిట్లు, ప్రజలకు వైరస్‌ పై అవగాహన కార్యక్రమాలకు ఈ మొత్తం ఖర్చు చేశారు.
Tags:    

Similar News