నిన్న రాత్రి నేను అంటూ ఆ ఎంపీ ఓ లేఖ రాశారు. నెటిజన్లకు.. నిన్న రాత్రి నేను..కరెంట్ కోతలతో అవస్థలు పడ్డాను అంటూ మొదలుపెడుతూ రాష్ట్రంలో నెలకొన్న అంధకారాలను ప్రశ్నిస్తూ ఆయన ఓ లేఖ రాశారు. సెల్ ఫోన్ లైట్ వెలుగుల్లో తాము ఏ విధంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించింది అన్నది కూడా వివరించారు.ఇంతకూ ఎవరాయన ఏమా కథ.
ఏమైందంటే
శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు,అదేవిధంగా ఆయన బాబాయ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గ సమీక్షకు నిన్న వెళ్లారు. వెళ్లాక కార్యక్రమం నిర్వహించాలని ఆలోచిస్తుండగా ఇంతలోనే కరెంట్ పోయింది.
ఒకటి కాదు రెండు కాదు మూడు గంటలకు పైగా అనధికార కోతలు టెక్కలిలో అమలు అవుతున్నాయి అనేందుకు నిదర్శనమే నిన్నటి ఘటన.ఇంకేం చేస్తారు . సెల్ ఫోన్ వెలుగుల్లోనే నియోజకవర్గ సమీక్ష చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మరోవైపు అస్సలు కోతలే లేవని కోతలు కోస్తున్నారు వైసీపీ నేతలు అంటూ పసుపు పార్టీ పెద్దలు మండిపడుతున్నారు.
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా శ్రమించాలని, ఆ రోజు విపక్షంలో ఉన్నప్పుడు అలుపెరుగక పోరాడి వైఎస్సార్ వర్గాలపై ఎర్రన్నాయుడు విజయం సాధించారని,అదేవిధంగా ఇప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి పై ప్రజాపోరాటం విస్తృతం చేయాలని
పిలుపునిచ్చారు అచ్చెన్న.కార్యకర్తలెవ్వరూ అనవసర వివాదాల్లోకి వెళ్లొద్దని, క్రియాశీలక, నిర్మాణాత్మక వైఖరికి కట్టుబడి ఉండాలని కోరారు.వైసీపీ వలంటీర్ల తీరుతెన్నులపై విమర్శలు గుప్పించారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమీక్షలో తెలుగు యువత జిల్లా అధ్యక్షలు మెండ దాసు నాయుడు పాల్గొన్నారు.