కల్తీ మాఫియా .. ప్రస్తుత రోజుల్లో కల్తీ లేని వ్యాపారం ఏదైనా ఉంది అంటే వాటర్ వ్యాపారం ఒక్కటే. ఆ వ్యాపారంలో కల్తీ చేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి చేయలేకపోతున్నారు. లేకపోతే అందులో కూడా కల్తీ చేసే మహానుభావులు ఉన్నారు. ఈ మద్యే నెల్లూరు లో కల్తీ పాల మాఫియా పట్టుబడగా , తాజాగా విజయవాడ లో కల్తీ మాంసం మాఫియా వెలుగులోకి వచ్చింది. చెడిపోయిన మాంసాన్ని తీసుకువచ్చి శుభ్రం చేసి మంచి మాంసంలా కలరింగ్ ఇచ్చి , అమాయకుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. అలాంటి వారిని తాజాగా సంబంధిత అధికారులు గుర్తు చేశారు.
దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే ... నిబంధనల ప్రకారం మటన్ విక్రయదారులు మేకలను, పొట్టేళ్లను వధించి వీఎంసీ స్టాంప్ వేసి విక్రయించాలి. ఈ నిబంధనలను మాంసపు వ్యాపారులు పాటించడం లేదు. ఏదో ఒక దానిపై నామమాత్రంగా వేసి మటన్ అమ్ముతున్నారు. ఇక అధికశాతం మాంసం డబ్బులకు కక్కుర్తి పడి కుళ్లిపోయిన మటన్‌ను చెడిపోయిన మటన్ ను ప్రజలకు విక్రయిస్తున్నారు. అయితే ఏది మంచిదో , ఏది పాడైపోయిందో తెలియని అమాయక జనం ఆ కుళ్ళిన మాంసం తిని అనారోగ్యం పాలౌతున్నారు. . వారానికి దాదాపుగా 4 టన్నుల కల్తీ మాంసంను ఈ మాఫియా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే , ఇప్పటికే పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. కానీ విక్రయదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. నవంబర్ 4వ తేదీన ఫుడ్ ఇన్స్ పెక్టర్ వీఎంసీ వెటరనరీ అధికారులు 400 కిలోల కుల్లిపోయిన మాంసంను గుర్తించారు. ఇదంతా విజయవాడలోని బందర్ రోడ్డులోని ఓ రెస్టారెంటులో నిల్వ ఉంచారు. నిల్వ ఉంచిన ఈ మాంసంతో వివిధ రకాల నాన్ వెజ్ ఐటెమ్స్ ను ఆ రెస్టారెంటు తయారు చేసి వచ్చిన కస్టమర్లకు వడ్డిస్తోంది. ఇక దాడుల సమయంలో స్వాధీనం చేసుకున్న మటన్‌లో పురుగులు ఉన్నట్లు అధికారులు గమనించారు. ఫ్రిడ్జ్‌లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మటన్ తింటే ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే నగరంలో పలువైపుల దాడులు నిర్వహించి కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న వారిని పట్టుకున్నారు.