జస్టిస్ ఎన్వీ రమణ నేపథ్యమిదీ

Update: 2021-03-24 17:30 GMT
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా తెలుగు వ్యక్తి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కానున్నారు. ఆయననే 48వ సీజేఐగా ప్రతిపాదిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ బోబ్డే కేంద్రన్యాయశాఖకు లేఖ రాశారు.
ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ ఎస్.ఏ బోబ్డే పదవీకాలం పూర్తికానుంది. దీంతో ఎన్వీ  రమణ పేరును బోబ్డే ప్రతిపాదించారు.

నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ కే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి దక్కాల్సి ఉంటుంది. బోబ్డే తర్వాత ఎన్వీ రమణ సీనియర్ గా ఉన్నారు.ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.

తెలుగు వారైన జస్టిస్ ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 2017 ఫిబ్రవరి 14 నుంచి జస్టిస్ రమణ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు.అంతకుముందు  ఢిల్లీ , ఏపీ హైకోర్టు (2000-2013 వరకు) జడ్జిలుగా పనిచేశారు.
Tags:    

Similar News