అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నేలను చూస్తున్నాయి. అప్పుడప్పుడు ధరలు కాస్త పెరిగినా.. తర్వాత సర్దుకుంటున్నాయి. గతంలో మాదిరి భారీగా పెరిగిపోతున్న పరిస్థితి లేదు. అయినప్పటికీ దేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్న వైనం కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతోంది. మధ్యతరగతి జీవి బడ్జెట్ ను కకావికలం చేయటంతోపాటు.. భారీ భారాన్ని మోపుతోంది.
గతంలో ఎప్పుడూ లేనంత భారీగా పెట్రోల్.. డీజిల్ ధరలు చేరుకున్నాయి. ఇదే ఊపు కొనసాగితే.. చాలా తక్కువ వ్యవధిలోనే లీటరు పెట్రోల్ రూ.100 దాటిపోవటం.. డీజిల్ అదే దారిన పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. లీటరు పెట్రోల్.. డీజిల్ పై చెల్లించే పన్ను భారం భారీగా ఉన్నప్పటికీ.. ఆ ఆదాయం మీద కన్నేసిన ప్రభుత్వాలు.. వాటిని వదులుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో.. అంతకంతకూ పెరుగుతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
తాజాగా పెరిగిన పెట్రోల్ ధర ఆల్ టైం హయ్యస్ట్ గా చెప్పాలి. గడిచిన 22 రోజుల్లో హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ధర రూ.1.83కు పెరిగింది. జనవరి ఒకటిన లీటరు పెట్రోల్ రూ.87.06 ఉంటే.. ఇప్పుడది రూ.8889కు చేరుకుంది. అదే సమయంలో డీజిల్ ధర జనవరి ఒకటిన రూ.80.60 ఉంటే.. ఈ నెల 22న రూ.82.53కు చేరుకుంది. ఇంతకీ అంతలా పెట్రోల్.. డీజిల్ ధరలు పెరుగుతున్నాయంటే.. పెట్రోలియం డీలర్ల సమాఖ్య సంఘంమాజీ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ అనే పెద్ద మనిషి కొత్త తరహా కారణాన్ని చెప్పారు.
గత ప్రభుత్వం (యూపీఏ) అప్పుతో పెట్రోల్ కొనుగోలు చేసిందని.. అప్పట్లో ధరలు పెంచకపోవటం వల్ల చోటు చేసుకున్న లోటును.. ఇప్పుడు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. మార్చి.. ఏప్రిల్ వరకు ఇలాంటి పరిస్థితే ఉంటుందని.. ఆ తర్వాత ధరలు తగ్గే వీలుందంటున్నారు. ఈ ఉదంతం చెప్పే నీతి ఏమంటే.. పాలకులు ఎడాపెడా చేసే అప్పులు.. అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు బాగానే ఉన్నా.. భవిష్యత్తులో చుక్కలు చూపిస్తాయన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. ఇప్పటికైనా కళ్లు తెరిస్తే ఓకే. లేకుంటే.. రానున్న రోజుల్లో ఇలాంటి భారాలు మరెన్నింటినో మోయాల్సి ఉంటుంది.