అమెరికాలో అతి పెద్ద ఉద్దీపన ప్యాకేజీ.. అందులో ఏముంది?

Update: 2021-03-11 10:30 GMT
అధికారం చేపట్టిన నాటి నుంచి పాజిటివ్ నిర్ణయాల్ని వరస పెట్టి తీసుకుంటున్న జో బైడెన్ సర్కారు..తాజాగా అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించింది. ఏకంగా 1.9 ట్రిలియన్ల ప్యాకేజీకి ఆ దేశ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేసింది. దీంతో.. కోవిడ్ కారణంగా చతికిలపడ్డ చిన్న.. మధ్యతరగతి పరిశ్రమలకు ఊతమిచ్చి.. పౌరుల్ని ఆర్థికంగా ఆదుకునేదుకు బైడెన్ గతంలో పేర్కొన్న ప్యాకేజీ ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది.

తాజాగా అమెరికా కాంగ్రెస్ లో ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. 220-221 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. డెమొక్రాట్లు అంతా ఈ బిల్లును సానుకూలంగా ఓట్లు వేస్తే.. రిపబ్లికన్లు మాత్రం వ్యతిరేకించారు. అయితే.. అత్యధికులు ఈ బిల్లుకు ఓకే చెప్పటంతో ఈ బిల్లు కాస్తా వాస్తవరూపం దాల్చనుంది. బిల్లు ఆమోదం పొందిన కాసేపటికే.. బైడెన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

''సాయం ఇక్కడ ఉంది. నిరుద్యోగులకు ఉపశమనం.. అందరికి టీకాలు'' అని పేర్కొన్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మిలియన్ల మంది అమెరికన్ల జీవితాల్ని.. జీవనోపాధిని కాపాడుతుందని స్పీకర్ నాన్సీ పెలోసీ పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందిన ఈ బిల్లు తాజాగా అధ్యక్షుడు బైడెన్ సంతకంతో వాస్తవ రూపం దాల్చనుంది. తాజా నిర్ణయం కారణంగా కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బ తిన్న అమెరికా పౌరులతో పాటు.. చిన్న.. మధ్య తరహా పరిశ్రమలు ఆర్థికంగా ఆదుకోవటానికి ఉపకరిస్తుందని చెబుతున్నారు.

కరోనా కారణంగా అగ్రరాజ్యం అమెరికా మిగిలిన దేశాల కంటే ఎక్కువగా ప్రభావితమైంది. ఆ దేశంలో మహమ్మారికారణంగా ఏకంగా 2.5లక్షలకు పైగా అమెరికన్లు మరణించారు. ఒక విపత్తు కారణంగా ఇంత మంది మరణించటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.
Tags:    

Similar News