కాలం మారింది. ఇప్పుడు అరేంజ్డ్ పెళ్లిళ్లు జరగడం కానకష్టం. యువతీ యువకులు తమకు నచ్చిన వారిని వారే ఎంపిక చేసుకొని తల్లిదండ్రులకు చూపిస్తే వారు పెళ్లిళ్లు చేస్తున్నారు. కాదంటే లేచిపోయి వారే చేసుకుంటున్నారు. రానురాను అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి ఉండవా అన్న రీతిలో సమాజ పోకడలు మారిపోతున్నాయి.
అయినా ఈ కాలంలో ముక్కూ మొహం తెలియని వారిని చేసుకునే కంటే తమకు తెలిసినవాడినే చేసుకోవడం బెటర్ అన్న ధోరణి యువతీ యువకుల్లో నెలకొంది. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎక్కువైంది. ప్రేమలు సమాజంలో ఎక్కువయ్యాయి.
తాజాగా తమిళనాడులోనూ వరుడికి ఓ వధువు షాకిచ్చింది.. సరిగ్గా తాళికట్టే ముందు పెళ్లిని ఆపి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. మరో అరగంటలో తన బాయ్ ఫ్రెండ్ వస్తాడని.. తామిద్దరం ప్రేమించుకున్నామని.. అతడినే చేసుకుంటానంటూ ప్రియుడికి తెగేసి చెప్పింది.
దీంతో అవాక్కైన పెళ్లికొడుకు తాళిని ఆమె ముఖాన కొట్టి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బంధువులంతా పెళ్లి కూతురు తరుఫువారిపై దుమ్మెత్తిపోసి కళ్యాణమండపం వదిలి వెళ్లిపోయారు.
ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లి చేసుకుంటానని వస్తానన్న ప్రియుడు సైతం రాలేదు. దీంతో ఇటు పెళ్లికొడుకు పోయి.. ప్రియుడు పరార్ అయ్యి ఆ పెళ్లికూతురు నిండా మునిగింది. మండపంలోనే వధువు బావురుమంది.
నెలరోజుల కిందటే వరుడికి వధువుకి నిశ్చితార్థం జరిగింది.అప్పుడే పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ ప్రేమ వ్యవహారం ముందే చెప్పినా ఇంత ఖర్చు, పెళ్లికొడుకుకు అవమానం తప్పేది. కానీ వధువు అతడితో ఫోన్లో మాట్లాడుతూ నెలరోజులుగా అతడికి ఆశ చూపి చివరకు పెళ్లి పీటల మీద నో చెప్పేసరికి వరుడి ముఖంలో నెత్తురు చుక్కలేని పరిస్థితి నెలకొంది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.